English   

మా సమంతకు సారీ చెప్తావా లేదా.. పూజా హెగ్డేకు వార్నింగ్..

sam
2020-05-29 06:59:48

తెలుగు ఇండస్ట్రీలో హీరోల అభిమానులు గొడవ పడుతుంటారు కానీ ఇప్పుడు మాత్రం విచిత్రంగా ఇద్దరు స్టార్ హీరోయిన్స్ అభిమానుల మధ్య వార్ జరుగుతుంది. అనుకోకుండా జరిగిన పొరపాటో లేదంటే కావాలనే చేసిందో తెలియదు కానీ పూజా హెగ్డే మాత్రం ఓ చిన్న రచ్చ అయితే చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో సమంతపై సంచలన పోస్ట్ చేసింది. మజిలీ సినిమాలోని సమంత స్క్రీన్ షాట్ చూపిస్తూ అందులో సమంత ఏమంత అందంగా లేదని పోస్ట్ చేసింది పూజా. ఇది చూసిన తర్వాత సమంత అభిమానులు పూజా హెగ్డేను ఏకేస్తున్నారు. #PoojaMustApologizeSamantha అనే హ్యాష్ ట్యాగ్‌ క్రియేట్ చేసి ఇండియాలోనే నెంబర్ వన్ ట్రెండింగ్ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు సమంతకు నువ్వు క్షమాపణలు చెప్తావా లేదా అంటూ పూజా హెగ్డేను ఆడుకుంటున్నారు.

ఆమెకు వ్యతిరేకంగా వేలల్లో ట్వీట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. ఇంత జరుగుతున్నా పూజా మాత్రం తీరిగ్గా తన పని తాను చేసుకుంటుంది. పైగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ హ్యాక్ అయిందని.. అదే విషయం తన టీమ్‌కు చెప్తే వాళ్లు కొన్ని గంటల పాటు శ్రమించి బాగు చేసారని చెప్పుకొచ్చింది. గంట పాటు చాలా కష్టపడి మళ్లీ సరైన స్థితికి తీసుకొచ్చారని చెప్పింది పూజా. దాంతో అప్పటి వరకు తన సోషల్ మీడియాలో వచ్చినవి పట్టించుకోవద్దని చెప్పుకొచ్చింది ఈమె. కానీ సమంత పేరు మాత్రం చెప్పలేదు. కానీ వెంటనే ఆ పోస్టులను మాత్రం తీసేసింది పూజా. ఆ తర్వాత చేసిన ట్వీట్స్‌లో సమంత గురించి ప్రస్థావించకపోవడం.. అసలేం జరగనట్లే ఉండటంతో ఫ్యాన్స్‌కు మరింత చిర్రెత్తికొచ్చింది. సమంత చేసిన సినిమాలను.. పూజా హెగ్డే చేసిన సినిమాలను కంపేర్ చేస్తూ ఆడుకుంటున్నారు ఫ్యాన్స్. మా హీరోయిన్ తో పోలిస్తే నువ్వు ఓ హీరోయినా అంటూ రెచ్చిపోతున్నారు స్యామ్ ఫ్యాన్స్. చివరికి సమంత విక్టరీ సింబల్ తో ఫోటో పెట్టి ఫ్యాన్స్ ను కూల్ చేసే ప్రయత్నం చేస్తుంది. 

 

More Related Stories