English   

సమంత యూ టర్న్ కు అదే రైట్ టైమ్

Samantha Akkineni Latest Movie U Turn Release Date Announced

ముందు నుంచీ గోల్డెన్ లెగ్ గానే పేరు తెచ్చుకున్న బ్యూటీ సమంత. పెళ్లి తర్వాత కూడా ఆ లెగ్ మహిమ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. తను ఈ యేడాది నటించిన మూడు సినిమాలూ బ్లాక్ బస్టర్ గానే నిలిచాయి. ఈ నేపథ్యంలో తను ఎప్పటి నుంచో నిర్మించాలనుకున్న ఓ కన్నడ సూపర్ హిట్ సినిమాను కూడా నిర్మిస్తూ బిజీగా ఉందిప్పుడు. కన్నడలోని టైటిల్ నే రిపీట్ చేస్తూ దాన్ని ‘యూ టర్న్’ గా తెలుగులో రీమేక్ చేస్తోంది. కన్నడలో డైరెక్ట్ చేసిన పవన్ కుమారే దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. థ్రిల్లర్ సబ్జెక్ట్ గా వచ్చిన ఈ మూవీ కన్నడలో సూపర్ హిట్ అయింది. కాస్ తెలుగు నేటివిటీకి అనుగుణమైన మార్పులు చేసి తెరకెక్కిస్తోన్న ఈ మూవీకి సంబంధించి మరో బిగ్గెస్ట్ అస్సెట్ .. అందరూ టాలెంటెడ్ యాక్టర్సే ఉన్నారు. మంచి అంచనాల మధ్య వస్తోన్న ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 13న సమంత యూ టర్న్ విడుదల కాబోతోంది.

సమంతతో పాటు ఆది పినిశెట్టి, భూమిక, రాహుల్ రవీంద్రన్ వంటి నటులు నటిస్తున్నారు. ఇప్పటికే సమంత, ఆదికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ఆకట్టుకున్న ఈ టీమ్.. లేటెస్ట్ గా ఓ పోస్టర్ విడుదల చేసింది. పగిలిన అద్దాల్లో నుంచి ఒక్కో ముక్కలో ఒక్కో ఆర్టిస్ట్ కనిపిస్తోన్న ఈ పోస్టర్ నిజంగానే పగిలిపోయిందనే చెప్పాలి. సింప్లీ సూపర్బ్ అంతే. నిజంగానే సినిమా కంటెంట్ కు తగ్గట్టుగా ఒక్కో మేటర్ రివీల్ చేస్తూ పోస్టర్స్ తోనే థ్రిల్ చేస్తోంది శామ్. మరి సినిమా ఎలా ఉంటుందో కానీ ఈ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. వాటిని అందుకోవడానికి ఈ మూవీని సెప్టెంబర్ 13న విడుదల చేయబోతున్నారు.

More Related Stories