English   

చిరంజీవి కోసం సమంత కష్టాలు

Samantha Akkineni Promoting Chi la Sow movie
2018-08-01 06:34:50

సమంత నాగచైతన్య ఈ మధ్య తెగ కష్టపడుతున్నారు. ఎందుకో తెలుసా.. చిరంజీవి కోసం. అతను ఏం చేసినా వెంటనే బావుందనడం.. జనాల్లోకి తీసుకువెళ్లడం బాగా చేస్తున్నారు. పైగా దర్శకుడు రాహుల్ ను సైతం తెగ మోసేస్తున్నారు. ఇంతకీ ఈ చిరంజీవి ఎవరో తెలుసా.. సుశాంత్.. యస్.. సుశాంత్ హీరోగా నటించిన చిలసౌ సినిమా ప్రమోషన్స్ ను తమ సొంత సినిమా రేంజ్ లో చేస్తున్నారు శామ్ అండ్ చే. మరి ఈ స్థాయిలో ఈ సినిమాను వాళ్లెందుకు మోస్తున్నారు. అంటే ఎవరైనా వెంటనే సుశాంత్ వారికి బంధువు కాబట్టి అని చెబుతారు. కానీ అందులో నిజం సగం మాత్రమే. ఎందుకంటే అక్కినేని వారిది బిజినెస్ మైండ్ సెట్ అని అందరికీ తెలుసు. ఆ బిజినెస్ లేకుండా పూర్తిగా ఏదీ తలకెత్తుకోరనేదీ తెలుసు. ఇందులోనూ ఆ యాంగిల్ ఉంది మరి.

నిజానికి చిలసౌ సినిమా ట్రైలర్ బావుంది. పాటలు ఆకట్టుకున్నాయి. ఓ కొత్త తరహా సినిమా చూడబోతున్నాం అనే విషయమూ అర్థమౌతోంది. పూర్తిగా పాజిటివ్ వైబ్స్ తో ఆగస్ట్ 3న సినిమా విడుదల కాబోతోంది.  అందువల్ల సమంత, చైతూ ఈ సినిమాను ప్రమోట్ చేయడంలో తప్పు లేదు. కానీ ఇందులోమరో యాంగిల్ ఏంటంటే.. చిలసౌ అన్నపూర్ణ బ్యానర్ నుంచి విడుదలవుతోంది. అంటే ఒక రకంగా ఇది తమ సొంత సినిమా కూడా. అందుకే సినిమా ప్రమోషన్స్ లో విరివిగా పాల్గొంటున్నారు. ఇప్పుడు నాగార్జున ఇది మంచి సినిమా అంటే నమ్మే స్టేజ్ లో ఆడియన్స్ లేరు. అందుకే క్రేజీ కపుల్ గా ఉన్న చే, శామ్ లతో ప్రమోషన్స్ నడిపిస్తున్నారు. లేటెస్ట్ గా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఏకంగా తమ తమ లవ్ స్టోరీస్ కూడా చెప్పుకున్నారు. వీరికి నటుడు నుంచి దర్శకుడుగా మారిన రాహుల్ రవీంద్రన్ కూడా వంతపాడాడు. తన లవ్ స్టోరీ కూడా చెప్పుకున్నాడు. అన్నట్టు రాహుల్.. సమంతకు ఏమాయ చేశావె నుంచీ తెలుసట. తనకు మంచి ఫ్రెండ్ కూడానట. ఏదేమైనా ఇలా ఎంటైర్ ఫ్యామిలీ ఒక సినిమా కోసం ముందుకు రావడం.. బానే ఉంది కానీ.. దాని రిజల్ట్ మాత్రం వీరి మాటలపై ఆధారపడి ఉండదు.. మొత్తంగా సుశాంత్ కెరీర్ లో నాగ్ ఫ్యామిలీ మరీ ఇంతగా ప్రమోట్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. అది ఫలించి సుశాంత్ కు ఈ మూవీ ఫస్ట్ బిగ్ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి.

More Related Stories