English   

స‌మంత‌.. శ్రీ‌మ‌తి ఓ బ‌హుమ‌తి..

chaithu samantha
2018-07-24 12:14:44

పెళ్లి త‌ర్వాత ఎవ‌రో ఒక్క‌రి లైఫ్ మారిపోతుందంటారు. కానీ ఇక్క‌డ మాత్రం ఇద్ద‌రి జీవితాలు.. కెరీర్స్ మారిపోయాయి. భార్య‌గా స‌మంత కొత్త పాత్ర‌లో ఒదిగిపోయింది. ఇక నాగ‌చైత‌న్య కూడా అంతే అందంగా అద్భుతంగా త‌న దాంప‌త్యాన్ని సాగిస్తున్నాడు. చై స్యామ్ జంట‌ను చూసి అంతా అద్భుతం అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఇద్ద‌రూ సినిమాల్లోనే కాదు.. యాడ్స్ లోనూ రప్ఫాడిస్తున్నారిప్పుడు. పెళ్లికి ముందు కూడా స‌మంత‌కు చాలా క్రేజ్ ఉంది. ఆమెతో యాడ్స్ చేయ‌డానికి చాలా కంపెనీలు పోటీ ప‌డ్డాయి. అయితే పెళ్లైన త‌ర్వాత చైతూ కోసం కూడా పోటీ ప‌డుతున్నారిప్పుడు. అయితే ప‌క్క‌నే స‌మంత కూడా ఉంటేనే ఆ క్రేజ్. స్యామ్ వ‌చ్చిన త‌ర్వాత చైతూ క్రేజ్ రెండింతలైంది. 

ఈ ఇద్ద‌రూ క‌లిసి ఇప్పుడు యాడ్స్ లో కుమ్మేస్తున్నారు. రియ‌ల్ లైఫ్ క‌పుల్ కావ‌డంతో వీళ్లు చెబితే త‌మ ప్రాడ‌క్ట్ రేంజ్ పెరుగుతుంద‌ని భావిస్తున్నాయి కంపెనీలు. ప‌ట్టులాంటి ఛ‌ర్మం కోసం అంటూ భార్య‌తో క‌లిసి రెక్సోనా యాడ్ లో మెరిసిపోతున్నాడు చైతూ. ఇక ఇదే టైమ్ లో శ్రీ‌మతి ఓ బ‌హుమ‌తి అంటూ శివ‌నిర్వాణ సినిమాలో క‌లిసి న‌టిస్తున్నారు ఈ జంట‌. పెళ్లికి ముందు న‌టించినా అప్పుడు రాని క్రేజ్ ఇప్పుడు వ‌స్తుంది. దానికి కార‌ణం పెళ్లి త‌ర్వాత క‌లిసి న‌టిస్తుండ‌ట‌మే. కోన వెంక‌ట్ ఈ క‌థ‌కి మెరుగులు దిద్దుతున్నాడు. మొత్తానికి అటు సినిమాలు.. ఇటు యాడ్స్ అన్నిట్లోనూ అక్కినేని జంట కుమ్మేస్తున్నారిప్పుడు. 

More Related Stories