English   

ఆటోడ్రైవర్ కు కార్ గిఫ్ట్ గా ఇచ్చిన సమంత

samantha
2021-04-17 16:55:29

అక్కినేని వారి కోడలు సమంత పెద్ద మనసు చాటుకుంది. కష్టాల్లో ఉన్న ఓ కుటుంబాన్ని ఆదుకుంది. ఓ మహిళా ఆటోడ్రైవర్ కష్టానికి సెల్యూట్ కొట్టి కారును గిఫ్ట్ గా ఇచ్చింది. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం డోవూర్ గ్రామానికి చెందిన కవిత అనే మహిళ భర్త వేధింపులు తాళలేక ఒంటరి జీవితం గడుపుతోంది. తల్లి తండ్రులు కూడా లేకపోవడం తో ఏడుగురు చెల్లెళ్ళ అలానా పాలనా కవితే చూసుకుంది. ఇక కొద్ది రోజులపాటు ఊర్లో వ్యవసాయం చేసిన కవిత ఉపాధి కోసం హైదరాబాద్ లోని బాచుపల్లికి వచ్చింది. ఇక్కడే ఆటో నడపటం నేర్చుకుని ఆటోడ్రైవర్ గా జీవనం సాగిస్తోంది. 

ఇక కవిత జీవితంపై యూట్యూబ్ లో ఉన్న వీడియోలు చూసిన సమంత చలించిపోయింది. ఆమె కష్టం చూసి ఎలాగైనా సహాయం చేయాలని నిర్ణయించుకుంది. దాంతో ఆరునెలల నుండి ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకుని పన్నెండున్నర లక్షలు విలువ చేసే షిఫ్ట్ డిజైర్ కారును గిఫ్ట్ గా ఇచ్చింది. శుక్రవారం ఈ కారును బంజారాహిల్స్ మారుతి షోరూం నుండి కవిత అందుకుంది. సమంత కారును గిఫ్ట్ గా ఇవ్వడం తో కవిత ఆనందానికి అవధుల్లేవు. కారును గిఫ్ట్ గా ఇచ్చిన సమంత కు కృతజ్ఞతలు తెలిపింది.

More Related Stories