English   

బోల్డ్ పాత్రలో అక్కినేని కోడలు

Samantha
2021-05-15 15:22:09

అక్కినేని వారి కోడ‌లు సమంత కెరీర్ మొద‌ట్లొ గ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టించి అల‌రించగా ప్ర‌స్తుతం ఆచితూచి అడుగులు వేస్తోంది. స‌మంత ప్ర‌స్తుతం త‌న పాత్ర‌కు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలు...ఆస‌క్తిక‌ర‌మైన కథ‌ల‌నే ఎంచుకుంటోంది. ఇదిలా ఉండ‌గానే స‌మంత సినిమాల‌తో పాటు డిజిటల్ రంగంలోనూ రానిస్తోంది. ఇప్ప‌టికే డిజిటల్ రంగంలో టాక్ షోతో సంద‌డి చేసిన స‌మంత అక్కినేని ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ లో స‌మంత పాత్ర గురించి నిర్మాత‌లు రాజ్ నిదిమోరు మ‌రియు క్రిష్ణ డికె ఆసక్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. ఈ చిత్రంలో సమంతా బోల్డ్ రోల్ చేస్తోందన్నారు. ఆమె నటన అందరినీ షాక్ కు గురిచేస్తుంద‌ని అన్నారు. మొద‌ట ఈ పాత్ర‌లో నటించేందుకు స‌మంత‌ను అడ‌గ‌టానికి భ‌య‌ప‌డ్డామ‌ని చెప్పారు. ఈ పాత్ర‌కు స‌మంత ఒప్పుకుంటుందా అనే అనుమానం వారిలో ఉండేద‌ని తెలిపారు. కానీ స‌మంత ఆ రోల్ చేసేందుకు ఒప్పుకుని అద్బుతంగా న‌టించింద‌ని అన్నారు. ఇదిలా ఉండ‌గా ఈ వెబ్ సిరీస్ లో మ‌నోజ్ బాజ్ పై కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. అంతే కాకుండా అందాల తార ప్రియ‌మ‌ణి కూడా ఈ సిరీస్ లో కీల‌క పాత్ర‌లో నటిస్తున్నారు. 

More Related Stories