English   

సమంత అన్నయ్యకా, తమ్ముడికా.. ?

Rajamouli-samantha

పెళ్లి తర్వాత కూడా వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోన్న బ్యూటీ సమంత. అంతే కాదు.. పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం తీరు మార్చుకోకుండా రెగ్యులర్ హీరోయిన్లానే ఎక్స్ పోజింగ్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం రామ్ చరణ్ తో రంగస్థలంలో నటించిన శామ్ నెక్ట్స్ .. తన భర్త నాగచైతన్యతో కలిసి మరో సినిమాకు సైన్ చేసింది. కథ బావుంటే ఏ పాత్రైనా చేయడానికి రెడీ అంటోన్న శామ్ కు ఓ ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చినట్టు టాక్. మరి అదేంటోతెలుసా.. రాజమౌళి సినిమా. యస్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో చేస్తోన్న ఈ భారీ మల్టీస్టారర్ లో హీరోయిన్ గా సమంతను తీసుకోవాలనుకుంటోందట జక్కన్న టీమ్. ఎన్టీఆర్, చరణ్ అన్నదమ్ములుగా నటిస్తోన్నఈ మూవీ కోసం జక్కన్న టీమ్ శామ్ తో చర్చలు కూడా జరుపుతున్నట్టు చెప్పుకుంటున్నారు. 

మరి ఈగ టైమ్ లో రాజమౌళి వేరు. ఇప్పుడాయన బాహుబలి రాజమౌళి.. కాబట్టి సమంత నో చెబుతుందనుకోలేం. ఒకవేళ సమంత ఈ ప్రాజెక్ట్ చేస్తే ఇద్దరు హీరోలలో ఎవరి సరసన తీసుకుంటారనే చర్చ హాట్ హాట్ గా సాగుతోంది టాలీవుడ్ లో. ఇప్పటికే ఎన్టీఆర్ సరసన నాలుగు సినిమాలు చేసింది. వీటిలో బృందావనం, జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్స్.. రభస, రామయ్యా వస్తావయ్యా యావరేజ్ సినిమాలు. ఇటు రామ్ చరణ్ తో ఫస్ట్ టైమ్ చేస్తోంది.. రంగస్థలంలో. ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందనేది అప్పుడే తెలియదు. కానీ ఎన్టీఆర్ సరసన అయితేనే వీరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. కాకపోతే రంగస్థలంలో కెమిస్ట్రీని బట్టి.. లేదా కథను బట్టి చరణ్ కు పెయిర్ గా తీసుకున్నా ఆశ్చర్యం లేదు. దీంతో సమంత అన్నయ్య  మరోవైపు సమంత కూడా రాజమౌళి డైరెక్షన్ లో ఈగ చేసింది. ఈ మూవీ తన కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటి. రాజమౌళికి కూడా సమంత అంటే మంచి నటిగా ఇష్టం ఉంది. దీంతో ఈ కాంబినేషన్ వర్కవుట్ కావడం పెద్ద కష్టమేం కాదంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ మూవీ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో రెగ్యులర్ షూట్ కు వెళ్లే సూచనలున్నాయి.. 

More Related Stories