English   

స‌మంత‌.. ఈ స‌మ్మ‌ర్ నీదేన‌మ్మా..!

Samantha
2018-05-14 14:49:04

పెళ్లైతే హీరోయిన్ కెరీర్ కు శుభం కార్డ్ ప‌డుతుంద‌ని ఎవ‌రండీ చెప్పింది..? ఇప్పుడు కాలం మారిపోయింది. బాలీవుడ్ మాదిరే ఇక్క‌డ కూడా ఇప్పుడు పెళ్లి త‌ర్వాత కూడా హీరోయిన్లు స్టార్లుగా వెలిగిపోవ‌చ్చు. మ‌న ప్రేక్ష‌కులు కూడా పెళ్లైనా.. హీరోయిన్ల‌ను ఆద‌రిస్తారు. సినిమాలు చూస్తారు.. ద‌ర్శ‌కులే ఇక నిర్ణ‌యం మార్చుకుని వాళ్ల‌కు అవ‌కాశాలు ఇవ్వండి..! దీనికి సాక్ష్యంగా స‌మంత‌ను చూపించండి. ఈ భామ కెరీర్ కు పెళ్లికి ముందు కంటే.. ఇప్పుడే ఇంకా అద్భుతంగా ఉంది. వ‌ర‌స‌గా మూడు విజ‌యాల‌తో స‌మ్మ‌ర్ ను షేక్ చేసింది ఈ మాయ‌లేడి. రంగ‌స్ధ‌లంలో రామ‌ల‌క్ష్మిగా.. మ‌హాన‌టిలో మ‌ధుర‌వాణిగా.. ఇప్పుడు విశాల్ అభిమ‌న్యుడులో గ‌వ‌ర్న‌మెంట్ ఎంప్లాయ్ గా మూడు పాత్ర‌ల్లోనూ ర‌ప్ఫాడించింది స‌మంత‌. వేటిక‌వే డిఫెరెంట్ రోల్స్. అన్నింటినీ త‌న న‌ట‌న‌తో నిల‌బెట్టింది. మరీ ముఖ్యంగా మ‌హాన‌టిలో మ‌ధుర‌వాణి పాత్ర అయితే ఆమె కెరీర్ లోనే ప్ర‌త్యేకంగా నిలిచిపోయింది. రంగ‌స్థ‌లంతో 120 కోట్ల విజ‌యాన్ని.. మ‌హాన‌టితో గౌర‌వాన్ని.. ఇరుంబుతిరైతో క‌మ‌ర్షియ‌ల్ సినిమాను ఖాతాలో వేసుకుంది స‌మంత‌. అందుకే 2018 స‌మ్మ‌ర్ స‌మంత‌కు చాలా ప్ర‌త్యేకం.

More Related Stories