English   

నాగచైతన్య, సమంతల మధ్య అతను లేడట..?

samantha-chaitanya
2018-02-12 19:47:40

గతేడాది నుంచి టాలీవుడ్ లో మోస్ట్ హాటెస్ట్ కపుల్ అంటే నాగచైతన్య, సమంతనే చెబుతారు. ప్రేమ నుంచి పెళ్లి వరకూ వచ్చిన వీరి బంధం ఎప్పుడూ టాప్ న్యూస్ లోనే నిలిచింది. పెళ్లికి ముందు  ఈ ఇద్దరూ కలిసి మూడు సినిమాల్లో నటించారు. పెళ్లి తర్వాత ఇద్దరూ బిజీగానే ఉన్నారిప్పుడు. అయితే లేటెస్ట్ గా ఓ సినిమాలో ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారనే వార్తలు టాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాయి. కానీ అందులో నిజం లేదని అక్కినేని క్యాంప్ నుంచి ఫీలర్స్ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా వచ్చిన రూమర్స్ లో కోన వెంకట్ పేరు ప్రధానంగా వినిపించింది.  నానితో నిన్నుకోరి వంటి సెన్సిబుల్ మూవీ తీసిన దర్శకుడు శివ నిర్వాణ తర్వాత సినిమా నాగచైతన్యతో చేస్తాడనే వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇది కూడా ప్యూర్ లవ్ స్టోరీనేనట. ఈ మూవీలో చైతూ సరసన సమంత నటిస్తోందనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆ ఇద్దరూ కలిసి ఈ సినిమాలో నటించేలా చేసింది కోన వెంకట్ అని చెప్పారు. కానీ అది అస్సలు నిజం కాదట. అసలు ఈ ప్రాజెక్ట్ లో కోన వెంకట్ హస్తం ఏమీ ఉండదట. అయినా సమంత ఓ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయాలంటే తనకు కథ నచ్చాలి. అందులో తన పాత్ర నచ్చాలి. అంతే కానీ బయటి వ్యక్తులు చెబితే చేసే టైప్ కాదు. మరి ఈ చిన్న విషయం మర్చిపోయిన రూమర్ రాయుళ్లు ఇప్పుడు నాలిక్కరుచుకుంటున్నారు.  ప్రస్తుతం చైతన్య చందుమొండేటి డైరెక్షన్ లో సవ్యసాచి చేస్తున్నాడు. అలాగే మారుతి దర్శకత్వంలో శైలజారెడ్డి అల్లుడులోనూ నటిస్తున్నాడు. ఈ రెండూ ష్యూర్ షాట్స్ చాలాకాలం నుంచే ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. 

More Related Stories