English   

కేటీఆర్.. స‌మంత మ‌ధ్య కోల్డ్ వార్..!

ktr samantha
2018-07-25 19:15:06

అవునా.. ఇది ఎప్పుడు జ‌రుగుతుంది.. ఇద్ద‌రూ ఒక‌రికి ఒక‌రు అన్న‌ట్లుంటారు క‌దా..! పైగా స‌మంత అంటే కేటీఆర్ చాలా గౌర‌వం ఇస్తాడు. ఆమెకు చేనేత వ‌స్త్రాల బ్రాండ్ అంబాసిడ‌ర్ ని కూడా చేసాడు. అంత‌లోనే ఏమైంది అనుకుంటున్నారా..? ఏమైందో తెలియ‌దు కానీ ఇప్పుడు స‌మంత‌, కేటీఆర్ మ‌ధ్య నాట్ ఓకే అనిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ పుట్టిన‌రోజు నాడు అంద‌రూ విష్ చేసినా కూడా స‌మంత మాత్రం విష్ చేయ‌లేదు. పోనీ మ‌రిచిపోయిందేమో అనుకుంటే రాత్రి వ‌ర‌కు కూడా క‌నీసం ఏ ఒక్క‌రు గుర్తు కూడా చేయ‌లేదా..? 
అలాంటి సీన్ అయితే ఉండ‌దు..

 అయితే మ‌రి ఎందుకు స‌మంత ఈ విషెస్ చెప్ప‌లేద‌నేది మాత్రం ఇప్పుడు ఇండ‌స్ట్రీతో పాటు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. గ‌తేడాది కేటీఆర్ బ‌ర్త్ డేకు అంద‌రికంటే ముందే విష్ చేసింది స్యామ్. కానీ ఈ ఏడాది మాత్రం అలా జ‌ర‌గ‌లేదు. కార‌ణం కూడా తెలియ‌డం లేదు. వీళ్లిద్ద‌రి మ‌ధ్య ఏదైనా కోల్డ్ వార్ జ‌రుగుతుందా..? ఎందుకంటే నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్ తో తెలంగాణ ప్ర‌భుత్వానికి కొన్ని త‌గాదాలు న‌డుస్తున్నాయి. ఇప్పుడు ఆమె కూడా అక్కినేని కోడ‌లే క‌దా.. అందుకే మామ‌గారి వైరాన్ని కోడ‌లు కూడా కొన‌సాగిస్తుందా అనేది తెలియాలిక‌. ఏదేమైనా స‌మంత విషెస్ చెప్ప‌క‌పోవ‌డం అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గానే మారిపోయింది.

More Related Stories