English   

మామ కోసం స‌మంత‌కు త‌ప్ప‌ట్లేదుగా..

Nag-samantha

అక్కినేని కోడ‌లు అనే బాధ్య‌త‌ను ప‌క్కాగా నిర్వ‌ర్తిస్తుంది స‌మంత‌. ఇప్ప‌టికే త‌న వ‌ల్ల అయిన ప్ర‌తీ విష‌యంలోనూ అక్కినేని హీరోల‌కు అండ‌గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ‌. మొన్న‌టికి మొన్న మ‌రిది అఖిల్ న‌టించిన హ‌లో సినిమాకు ప్ర‌మోష‌న్ చేసింది. ఇక ఇప్పుడు ఇదే ప‌నిని మామ కోసం చేయ‌బోతుంది. అవును.. నాగార్జున సినిమాను స‌మంత ప్ర‌మోట్ చేస్తుంద‌నే ప్ర‌చారం ఇండ‌స్ట్రీలో జ‌రుగుతుంది. అది కూడా వ‌ర్మ చేసిన ప‌నికి స‌మంత‌ను సాయం తెచ్చుకుంటున్నాడు ఈ మ‌న్మ‌ధుడు. ఈయ‌న వ‌ర్మ‌తో ఆఫీస‌ర్ సినిమా చేసాడు. ఇది షూటింగ్ పూర్తిచేసుకుని మే 25న విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్ర పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కూడా వేగంగానే జ‌రుగుతుంది. కానీ వ‌ర్మ ఇప్పుడు వ‌చ్చి ప్ర‌మోష‌న్ చేస్తాడా.. చేస్తే సినిమాను ప్రేక్ష‌కులు చూస్తారా అనేది అనుమాన‌మే. ఎందుకంటే ఈ మ‌ధ్య కాలంలో మ‌నోడు చేసిన ప‌నులు అలా ఉన్నాయి మ‌రి. పైగా ఈయ‌న‌పై ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీ ప‌గ ప‌ట్టింది. దాంతో వ‌ర్మ వ‌చ్చి ఇప్పుడు ప్ర‌మోష‌న్ చేసినా సినిమాకు నెగిటివ్ అవుతుందే కానీ పాజిటివ్ మాత్రం కాదు. అందుకే కోడ‌ల్ని రంగంలోకి దింపుతున్నాడు నాగార్జున‌. మామ కోసం స‌మంత కూడా వ‌చ్చేస్తుంది. మొత్తానికి అక్కినేని కోడ‌లి ప‌క్కాగా నిర్వ‌ర్తిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.

More Related Stories