English   

సమంత రంగస్థలంకు కటీఫ్ చెప్పిందా..?

Samantha-Rangasthalam

సమంత.. పెళ్లి తర్వాత కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనిపించుకుంటోన్న ఫస్ట్ సౌత్ ఇండియన్ లేడీగా పేరు తెచ్చుకుంది. లేటెస్ట్ గా రంగస్థలంతో తన కెరీర్ లో ది బెస్ట్ మూవీ చేశానని చెప్పుకుంది. కానీ అలాంటి బెస్ట్ మూవీకి కనీసం బెటర్ ప్రమోషన్స్ చేయడానికి కూడా రెడీగా లేదు. ఇది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిజానికి సమంత తన సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఇతర హీరోయిన్లలా కాకుండా చాలా సపోర్ట్ చేస్తుంది. అన్ని విషయాల్లో సహకరిస్తుంది. కానీ రంగస్థలం వరకూ వచ్చేసరికి ఆ సపోర్ట్ కనిపించడం లేదు. ఇందుకు చెబుతోన్న ప్రధానా కారణం.. తను వెకేషన్ లో ఉండటం. భర్త నాగచైతన్యతో కలిసి తనిప్పుడు యూఎస్ లోని మియామీలో సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తోంది. అది తన పర్సనల్ లైఫ్ కాబట్టి ఏం కమెంట్ చేయలేం. కానీ సినిమాలో సమంతకు చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. అలాంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్రమోషన్స్ లో కనిపించకపోతే ఆడియన్స్ కు చాలా డౌట్స్ వస్తాయి. 

గతంలో తన పెళ్లికి ముందు చేసిన రాజుగారి గది-2 సినిమా అప్పుడు కూడా తను ప్రమోషన్స్ కు సహకరించింది. పెళ్లి డేట్ కు ముందు.. సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ కాకుండానే కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చేసి రెడీగా పెట్టేసింది. ఆ విషయం రంగస్థలంకు వర్తింపచేయలేకపోయింది సమంత. ఇందుకు కారణాలేంటో కానీ.. సమంత కూడా ప్రమోషన్స్ లో ఉంటే ఖచ్చితంగా రంగస్థలంకు మరింత హైప్ వచ్చేది. ఇది నిజం. ఏదేమైనా సమంత లేని ప్రమోషన్స్  ఎంత సక్కగున్నావే పాట లేని రంగస్థలం మ్యూజిక్ ఆల్బమ్ లా ఉంది. 

More Related Stories