English   

నాగ‌చైత‌న్యకు ఇల్లాలే ప్రియురాలు.. 

Samantha-chaitanya
2018-03-07 10:54:02

అవును.. ఇప్పుడు ఇదే జ‌ర‌గ‌బోతుంది. ఇల్లాలే ప్రియురాలు కాబోతుంది. అప్ప‌ట్లో ఇల్లాలు ప్రియురాలు అనే సినిమా ఒక‌టి వ‌చ్చింది. శోభ‌న్ బాబు హీరోగా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఇప్పుడు ఇల్లాలినే ప్రియురాలిగా చేసుకుని నాగ‌చైత‌న్య వ‌స్తున్నాడు. దీనికి శివ‌నిర్వాన ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే క‌థ చెప్ప‌డం.. ఒప్పించ‌డం కూడా జ‌రిగిపోయాయి. అస‌లు విష‌యం ఏంటంటే.. నాగ‌చైత‌న్య హీరోగా స‌మంత హీరోయిన్ గా ఓ సినిమా రాబోతుంది. ఇదివ‌ర‌కు అయితే ఈ కాంబినేష‌న్ లో సినిమా అంటే ఓకే అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ఇది సంచ‌ల‌నం. ఎందుకంటే పెళ్ళైన త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి న‌టించ‌బోయే తొలి సినిమా ఇది. 

ఇన్నాళ్లూ చిన్న డౌట్స్ ఉండేవి. ఇప్పుడు అవి కూడా లేవు. నాగ‌చైత‌న్య‌, స‌మంత క‌లిసి న‌టించ‌డం ఖాయం అయిపోయింది. నిన్నుకోరి లాంటి సెన్సిబుల్ సినిమా చేసిన శివ‌నిర్వాణ దీనికి ద‌ర్శ‌కుడు. నానితో కృష్ణార్జున యుద్ధం సినిమా నిర్మిస్తున్న సాహు గ‌ర్ర‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించ‌నున్నారు. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ స్టేట్ మెంట్ కూడా త్వ‌ర‌లోనే రానుంది. చైతూ ప్ర‌స్తుతం స‌వ్య‌సాచితో పాటు శైల‌జారెడ్డి అల్లుడు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల త‌ర్వాత నాగ‌చైత‌న్య‌-శివ‌నిర్వాన సినిమా మొద‌లు కానుంది. దీనికి ప్రేయ‌సి అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. మొత్తానికి ఇల్లాలినే ప్రేయ‌సిగా మార్చుకుంటున్నాడు అక్కినేని వార‌సుడు.

More Related Stories