English   

స‌మంత ఫ్యాన్స్ కు శుభ‌వార్త‌.. 

Samantha-Ruth-Prabhu
2018-07-11 18:06:21

పెళ్లైన త‌ర్వాత శుభ‌వార్త అంటే ఉండేది ఒక్క‌టే.. త‌ల్లి కావ‌డం. ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ కు నాగ‌చైత‌న్య కూడా ఓ శుభ‌వార్త చెప్పాడు. అది కూడా స‌మంత గురించే. అయితే అంతా ఊహించుకున్న‌ట్లు అది ఆ వార్త మాత్రం కాదు. కెరీర్ కు సంబంధించిన గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నాడు చైతూ. ఈ మ‌ధ్య స‌మంత సినిమాలు మానేస్తుంద‌నే వార్త‌లు బాగానే వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించాడు చైతూ. స‌మంత సినిమాలు మానేయ‌డం అనేది శుద్ధ అబ‌ద్ధం అని.. తాను ఎన్నాళ్లు ఎన్నేళ్లు సినిమాలు చేయాల‌నుకుంటే అన్నేళ్లు చేస్తుంద‌ని చెప్పాడు నాగ‌చైత‌న్య‌. ఈ విష‌యంలో త‌న‌కెలాంటి అభ్యంత‌రాలు లేవ‌ని కూడా క్లారిటీ ఇచ్చాడు అక్కినేని వార‌సుడు. ప్ర‌స్తుతం స‌మంత చేతిలో అర‌డ‌జ‌న్ సినిమాలు ఉన్నాయి. త‌మిళ్ లో మూడు.. తెలుగులో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది స‌మంత‌. ఇలాంటి టైమ్ లో రిటైర్మెంట్ అనే ప‌దం వ‌చ్చేస‌రికి ఫ్యాన్స్ కూడా కంగారు ప‌డ్డారు. కానీ ఇప్పుడు చైతూ ఆన్స‌ర్ తో హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంతేలెండి.. ఓ పెళ్ళైన హీరోయిన్ ఇలా వ‌ర‌స సినిమాలతో దూసుకుపోవ‌డం కూడా మంచికే. ఇక‌పై పెళ్లంటే కెరీర్ కు శుభంకార్డ్ అనే మాట‌లు క‌నీసం స‌మంత‌ను చూసిన త‌ర్వాత అయినా పోతాయి. 

More Related Stories