English   

హీరోల్ని అడిగే ద‌మ్ములేదా అంటున్న స‌మంత‌.. 

samantha-1
2018-05-07 16:12:31

అవును.. స‌మంత ఇప్పుడు ఇదే ప్ర‌శ్న వేసింది. దీనికి స‌మాధానం చెప్ప‌డానికి కూడా ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. ఎందుకంటే స‌మంత అడిగిన దాంట్లో న్యాయం కూడా ఉంది. ఇప్పుడు త‌మ‌కు కూడా న్యాయం కావాలంటుంది ఈ ముద్దుగుమ్మ‌. అదేంటి.. ఇప్పుడు స‌మంత‌కు ఏ అన్యాయం జ‌రిగింది..? ఎందుకు ఆమె పోరాటం చేస్తుంది అనుకుంటున్నారా..? అవును.. ఇప్పుడు స‌మంత కూడా చిన్న సైజ్ పోరాటానికి తెర‌తీసింది. పెళ్లైన హీరోయిన్ల‌కు ఛాన్సులు రావు.. వాళ్ల‌ను ప్రేక్ష‌కులు చూడ‌రు.. పెళ్లైతే కెరీర్ కు ఎండ్ కార్డ్ ప‌డిన‌ట్లే అని ఇన్నాళ్లూ ఇండ‌స్ట్రీలో ఓ అనుమానం ఉండేది. అనుమానం కాదు నిజ‌మే అది. ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా పెళ్లైన హీరోయిన్ల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌రు. బాలీవుడ్ లో ఉన్నంత బ్రాండ్ నేచ‌ర్ ఇంకా ఇక్క‌డ అబ్బ‌లేదు మ‌నోళ్ల‌కు.
 
అందుకే హీరోయిన్ కు పెళ్లైతే న‌ట‌న‌కు ప‌నికి రాద‌ని ప‌క్క‌న బెట్టేస్తున్నారు. ఇప్పుడు స‌మంత ఇదే ఇష్యూపై నోరు విప్పింది. పెళ్లైన హీరోల‌ను ప్రేక్ష‌కులు చూస్తున్నారు క‌దా.. మ‌రి హీరోయిన్ల‌కు ఎందుకు చూడ‌రు.. మొన్న రంగ‌స్థ‌లంలో తాను న‌టిస్తే చూసారు క‌దా.. స‌మంత‌కు పెళ్లైంది క‌దా అని చూడ‌టం మాన‌లేదు క‌దా..! అంటే ద‌ర్శ‌కుల‌కు ప్రేక్ష‌కులు ఓ హింట్ ఇస్తున్న‌ట్లే క‌దా.. పెళ్లైనా కూడా హీరోయిన్ల‌ను మేం చూస్తాం.. మీరు తీయండి అని చెబుతున్న‌ట్లే క‌దా అని చెప్పింది స్యామ్. పైగా లిప్ లాక్స్ విష‌యంలోనూ పెళ్లైన హీరోలు పెడితే అడ‌గ‌రు కానీ హీరోయిన్ల‌ను మాత్రం ఎందుకు అడుగుతున్నారంటూ ర‌చ్చ ర‌చ్చ చేసింది స‌మంత‌. నిజానికి ఈమె అడిగిన దాంట్లో నిజం కూడా లేక‌పోలేదు. మ‌రి స‌మంత ప్ర‌శ్న‌ల‌కు సమాధానం ఎవ‌రు చెప్తారో చూడాలిక‌..!

More Related Stories