English   

స‌మంత‌ను సిద్ధూ అంత బాధ పెట్టాడా..?

samantha siddarth love
2018-06-05 07:45:18

త‌న జీవితంలోనూ జెమినీ గ‌ణేష‌న్ ఉన్నాడ‌ని చెప్పి సంచ‌ల‌నం సృష్టించింది స‌మంత‌. అస‌లు ఆ జెమినీ గ‌ణేష‌న్ ఎవ‌రు అనే ప్ర‌శ్న అయితే రాలేదు. ఎందుకంటే స‌మంత జీవితంలో అంద‌రికీ తెలిసిన జెమినీ గ‌ణేష‌న్ ఇంకెవ‌రో కాదు సిద్ధార్థ్. అప్ప‌ట్లో ఈ ఇద్ద‌రూ పెళ్లి చేసుకుంటార‌నే వార్త‌లు కూడా బాగానే వినిపించాయి. గుళ్ల‌కు వెళ్లి పూజలు కూడా చేయించుకున్నారు. కానీ చివ‌రి నిమిషంలో ఏమైందో తెలియ‌దు కానీ సిద్ధూను వ‌ద్ద‌నుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఆ త‌ర్వాత స‌మంత జీవితంలోకి నాగ‌చైత‌న్య వ‌చ్చాడు. ఇప్పుడు పెళ్లి చేసుకుని హాయిగా ఉంది. అయితే ఇప్పుడు ఉన్న‌ట్లుండి త‌న జీవితంలో కూడా జెమిని ఉన్నాడ‌ని.. త‌న జీవితం కూడా సావిత్రి జీవితం మాదిరే నాశ‌నం అయిపోయేద‌ని స‌మంత చెప్ప‌డం అంద‌రికీ షాక్ ఇస్తుంది. సిద్ధార్థ్ అంత‌గా స‌మంత‌ను బాధ పెట్టాడా అని..! అప్ప‌ట్లో కేవ‌లం ఇగోల వ‌ల్లే ఈ ఇద్ద‌రూ విడిపోయార‌నే టాక్ అయితే వ‌చ్చింది. ఇందులో సిద్దూ త‌ప్పే ఎక్కువ‌గా ఉంద‌ని.. అత‌డు ప్లే బాయ్ అని తెలుసుకుని స‌మంత సిద్ధార్థ్ ను వ‌దిలేసింద‌నే వార్త‌లు కూడా త‌మిళ‌నాట వినిపించాయి. ఆ త‌ర్వాతే త‌న పాత ప్రేమ‌క‌థ చైతూకు చెప్పింద‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. స‌మంత‌కు ప్రేమ కావాల్సిన స‌మ‌యంలోనే చైతూ బాగా ద‌గ్గ‌ర‌య్యాడు అలా ఇప్పుడు ఇద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు. కానీ జెమినీ గ‌ణేష‌న్ తో పోల్చేంత పెద్ద క‌థ సమంత లైఫ్ లో జ‌రిగింద‌ని మాత్రం ఎవ‌రూ ఊహించ‌లేదు. ఈ క్లారిటీ మాత్రం ఇప్పుడే వ‌చ్చింది అంద‌రికీ. ఈ లెక్క‌న అక్కినేని కోడలు కాకముందు సిద్ధూ వ‌ల్ల స్యామ్ బాగానే బాధ‌ప‌డింద‌న్న‌మాట‌.

More Related Stories