English   

సమంత గిఫ్ట్స్ ఇస్తానంటోంది.

mahanati-dubsmash

సమంత మీకు గిఫ్ట్స్ ఇస్తానంటోంది.. ఆవిడ మనకు గిఫ్ట్స్ ఇస్తే చైతూ ఊరుకుంటాడా.. అనుకుంటున్నారా.. అలాంటి ప్రాబ్లమ్ ఏం లేదు. తను నిజంగానే మీకోసం ఓ స్పెషల్ గిఫ్ట్స్ పంపిస్తానంటోంది. కాకపోతే అందుకోసం మీరు ఓ చిన్న పని చేయాలి. చూడ్డానికి చిన్నదే.. కానీ చేయడానికి మాత్రం కొంచెం కష్టపడాలి. మాయా బజార్ సినిమా నుంచి ఆహ నా పెళ్లియంటా అనే పాటలో మహానటి సావిత్రిలా డబ్ స్మాష్ చేసి.. ఆ వీడియోను మీరు సమంతకు పంపించాలి. అందులో ది బెస్ట్ ఒన్ తనే సెలక్ట్ చేసి మీకు స్పెషల్ గా కొన్ని గిఫ్ట్స్ ఇస్తానంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ఇప్పటికే ఈ డబ్ స్మాష్ కు సంబంధించిన ప్రమోషన్ వీడియో హల్ చల్ చేస్తోంది. వీడియోను బట్టి ఇది కేవలం అమ్మాయిలకే పరిమితం అయిన డబ్ స్మాష్ అని అర్థమౌతోంది కదా.. సో.. చైతూ నుంచి ఏం ప్రాబ్లమ్ ఉండదన్నట్టే కదా. ఏదేమైనా మహానటి ప్రమోషన్స్ లో ఇదో స్పెషల్ ఐటమ్.

మాహానటి సావిత్రి బయోపిక్ గా వస్తోన్న మహానటిలో టైటిల్ పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. మరి సమంత పాత్ర ఏంటన్నది ఇంత వరకూ రివీల్ చేయలేదు. సమంతతో పాటు విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. అతని పాత్రా సస్పెన్స్ గానే ఉంది. రేపు మహానటి ఆడియో విడుదల కాబోతోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ సినిమాలోని రెండు పాటలు ఇప్పటికే ట్రెండింగ్ లో ఉన్నాయి. అశ్వనీదత్ అల్లుడు, ఎవడే సుబ్రహ్మణ్యం ఫేమ్ నాగ అన్వేష్ డైరెక్ట్ చేస్తోన్న మహానటి మే 9న విడుదల కాబోతోంది.  సావిత్రి జీవిత కథను వెండితెరకెక్కించడం కొంత కష్టమైన పనే. కానీ ఆ పనిని దర్శకుడు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫక్ట్ చేసినట్టు కనిపిస్తోంది. ఇక సావిత్రి భర్త నాటి తమిళ్ స్టార్ హీరో జెమినీగణేశన్ పాత్రలో మళయాల యంగ్ స్టార్ దుల్కర్ సాల్మన్ నటిస్తున్నాడు. ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు నటించాడు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగ చైతన్య నటిస్తున్నారని సమాచారం. ఏదేమైనా మహానటితో టాలీవుడ్ లో  కొత్త ఫార్మాట్ కు తెరలేవబోతోంది. అయితే ఈ కాలం ఆడియన్స్ ను ఆకట్టుకోవడం కోసమే సమంత రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. మరి శామ్ చెప్పిన డబ్ స్మాష్ లో ఎవరు గెలుస్తారో కానీ.. ఐడియా మాత్రం బావుంది. 

More Related Stories