English   

విశాల్.. స‌మంత‌.. రొమాన్స్ అదిరింది..!

samantha-vishal
2018-05-07 17:21:26

స‌మంత న్యాచుర‌ల్ స్టార్. ఆమె ఏ పాత్ర‌లోకైనా ఇట్టే దూరేస్తుంది. ఒక్క‌సారి పాత్ర‌లోకి వెళ్లిపోయిందంటే ఎవ‌రి మాటా విన‌దు. ఇప్పుడు కూడా ఇదే చేస్తుంది ఈ భామ‌. విశాల్ తో ఈమె న‌టిస్తున్న అభిమ‌న్యుడు సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులో విశాల్ తో ఆమె చేసిన రొమాన్స్.. ఇద్ద‌రి కెమిస్ట్రీ చూసి ఎవ‌రికైనా కుళ్లు రావాల్సిందే. అంత‌గా ఇద్ద‌రూ స్క్రీన్ పై మాయ చేసారు. దీనికంటే ముందు విడుద‌లైన పాట‌ల్లో కూడా అదే కెమిస్ట్రీ చూపించారు ఇద్ద‌రు. ఈ మాయ‌లో ఎక్కువ భాగం స‌మంత‌కే వెళ్లిపోతుంది. చిన్న చిన్న క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తోనే పిచ్చెక్కిస్తుంది స‌మంత‌. ఇరుంబు తిరై సినిమాను తెలుగులో అభిమ‌న్యుడుగా తీసుకొస్తున్నారు. జ‌న‌వ‌రిలోనే రావాల్సిన ఈ చిత్రాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేయ‌లేదు. ఎప్పుడో మార్చ్ లోనే రావాల్సిన ఈ చిత్రం కాస్తా స్ట్రైక్ కార‌ణంగా ఆల‌స్యం అయింది. త్వ‌ర‌లోనే ఈ చిత్రం విడుద‌ల కానుంది. తెలుగులోనూ ఒకేసారి విడుద‌ల కానుంది ఈ చిత్రం. ఇందులో అర్జున్ విల‌న్ గా న‌టిస్తుండ‌టం విశేషం. తెలుగులో విశాల్ ఇమేజ్ కు తోడు స‌మంత క్రేజ్ కూడా అభిమ‌న్యుడు సినిమాకు క‌లిసి రానుంది. ఈ చిత్రాన్ని విశాల్ నిర్మిస్తున్నాడు. ఈ ఇద్ద‌రి రొమాన్స్ కోస‌మైనా సినిమా ఓసారి చూడచ్చేమో అనిపిస్తుంది. అంత‌గా మాయ చేసారు ఈ జంట‌. ఒక్క పాట‌లోనే కాదు.. అభిమన్యుడులోని అన్ని పాట‌ల్లోనూ స‌మంత‌, విశాల్ రొమాన్స్ కు మంచి మార్కులు ప‌డుతున్నాయి. అదీ లెక్క‌.. మ‌రి స‌మంతా మ‌జాకా..!

More Related Stories