English   

సిద్ధార్థ్ రావడంతో ఆ సినిమా నుంచి తప్పుకున్న సమంత..

 Samantha
2020-09-19 09:32:36

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు సిద్ధార్థ్ కు మంచి ఇమేజ్ వుండేది. వరుస విజయాలతో మన హీరోలను కూడా డామినేట్ చేశాడు ఈయన. కెరీర్ మంచి స్టేజ్ లో ఉన్నప్పుడు సమంతతో ప్రేమాయణం కూడా నడిపించాడు. ఇద్దరు కలిసి అప్పట్లో జబర్దస్త్ అనే సినిమాలో నటించారు. నందినిరెడ్డి ఈ సినిమాకు దర్శకురాలు. ఈ సినిమా సమయంలోనే సిద్దుతో ప్రేమలో పడింది సమంత. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అందుకే దోషాలు పోగొట్టుకోవడానికి ప్రత్యేక పూజలు కూడా చేశారు. అయితే చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది సమంత. అక్కడి నుంచి సిద్దార్థ్, సమంత ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇదిలా ఉంటే ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ జోడి గురించి వార్తలు వచ్చాయి. 

తాజాగా సిద్దు ఏడేళ్ల తరువాత తెలుగులో ఒక స్ట్రైట్ సినిమా ఒప్పుకున్నాడు. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహాసముద్రం సినిమాలో సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మేరకు చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటన కూడా విడుదల చేసింది. ఇందులో శర్వానంద్ మరో హీరో. ఇదిలా ఉంటే మహాసముద్రంలో హీరోయిన్లలో సమంత అక్కినేనిని తీసుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. కథ నచ్చి ఆమె కూడా చేయడానికి ఓకే అనేసింది. కానీ సిద్ధార్థ్ ఈ సినిమాలోకి వచ్చాడని తెలిసిన వెంటనే ఆమె తప్పుకుందనే ప్రచారం జరుగుతుంది. దాంతో దర్శక నిర్మాతలు కూడా చేసేదేమి లేక సమంత స్థానంలో ఐశ్వర్య రాజేష్ ఎంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన సిద్దు చేసిన మోసాన్ని సమంత ఇంకా మర్చిపోలేదు అని అర్థమవుతుంది. 

More Related Stories