English   

కోడలుపిల్లతో నాగ్...అక్కడ ప్యాకప్ చెప్పారట ?

Samantha
2019-05-21 18:28:34

కింగ్‌, నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. గతేడాది ‘చిల‌సౌ’ సినిమాతో ఆకట్టుకున్న ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్‌ తో ‘మ‌న్మ‌థుడు 2’ చేస్తున్నాడు నాగార్జున‌. పోర్చుగల్లో భారీ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ షూటింగ్ మొదలైంది. రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెల కిషోర్, రావు రమేష్ ఈ షెడ్యూల్లో పాల్గొననున్నారని సమాచారం. నాగార్జున సొంత బ్యానర్ అన్నపూర్ణలోనే మన్మథుడు 2 చేస్తున్నారు అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థతో పాటే మనం ఫిలిమ్స్ కూడా ఇందులో భాగస్వామిగా ఉంది. ఆర్ఎక్స్ 100 ఫేమ్ చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా  నెల‌పాటు పోర్చుగ‌ల్‌లో లాంగ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. ఇక గతంలో  మామా కోడళ్ళు కలిసి మ‌నం, రాజు గారి గ‌ది 2 లాంటి సినిమాల్లో న‌టించారు. మూడోసారి ఇప్పుడు మ‌న్మ‌థుడు 2 కోసం జోడీ క‌డుతున్నారు నాగార్జున‌, స‌మంత‌. ప్రమోషన్స్ లో భాగంగా విడుద‌లైన కొన్ని స్టిల్స్ సినిమా మీద అంచ‌నాలు పెంచేస్తున్నాయి.  చూడాలి మరి సినిమా ఏమి చేయనుందో ?

More Related Stories