English   

స‌మంత‌.. నిజంగా ఎంత స‌క్కుగున్నావే..!

Yentha-Sakkagunnave

కెరీర్ మొద‌ట్లో చాలా అందంగా ఉండేది స‌మంత‌. ఆ త‌ర్వాత ఎందుకో కానీ ఆ అందం స‌మంత మొహంలో మిస్ అయింది. మ‌ధ్య‌లో ఓ సారి స్కిన్ ఎల‌ర్జీ రావ‌డంతో ఎందుకో తెలియ‌దు కానీ మున‌ప‌టి గ్లామ‌ర్ స‌మంత ఫేస్ లో క‌నిపించ‌లేదు. అల్లుడు శీను నుంచి కాస్త ఛేంజ్ వ‌చ్చింది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ స‌మంతలో ఆ పాత అందం క‌నిపిస్తుంది. చూడ‌గానే మాయ చేస్తుంది. తాజాగా రంగ‌స్థ‌లంలో ఈ భామ‌ను చూస్తుంటే మ‌న‌సు మ‌న‌సులో నిల‌వ‌దు. ఎంత సక్క‌గున్నావే అంటూ చంద్ర‌బోస్ రాసిన పాట‌కు అచ్చ‌మైన నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది ఈ మాయ‌లేడి. పెళ్లైన త‌ర్వాత వ‌చ్చిన అంద‌మో ఏమో కానీ ఇప్పుడు స‌మంత రూపం చూసి ఫిదా అయిపోతున్నారంతా. 

రంగ‌స్థ‌లంలో ఇప్పుడు విడుద‌లైన రంగ‌మ్మ మంగ‌మ్మ పాట అయితే స‌మంత‌లో మ‌రో కోణం బ‌య‌టికి తీసుకొచ్చింది. అందం అంటే ఎక్స్ పోజింగ్ పూర్తిగా చేయాల్సిన ప‌నిలేదు.. కేవ‌లం చీర‌లోనే చంపేయొచ్చు అని మ‌రోసారి నిరూపించింది స‌మంత‌. ఈ సినిమాలో ల‌క్ష్మీ పాత్ర‌లో న‌టిస్తుంది స‌మంత‌. రామ్ చ‌ర‌ణ్ ను ఆట ప‌ట్టించే ఈ పాట‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తుంది. పెళ్లైన త‌ర్వాత ఏ హీరోయిన్ కు అయినా అవ‌కాశాలు రావంటారు కానీ స‌మంత మాత్రం దీనికి ప్ర‌త్యేకం. ఇప్ప‌టికీ ఈ భామ దూకుడు ఏ మాత్రం త‌గ్గ‌లేదు స‌రిక‌దా ఇంకా పెరిగింది.
 
2018 మొత్తాన్ని మొత్తంగా ద‌త్త‌త తీసుకుంటుంది స‌మంత‌. ఈ ఏడాది ఒక‌ట్రెండు కాదు.. అర‌డ‌జ‌న్ కు పైగా సినిమాల‌తో సంద‌డి చేస్తుంది స‌మంత‌. త‌మిళ‌నాట విజ‌య్ సేతుప‌తితో న‌టిస్తోన్న సూప‌ర్ డీల‌క్స్.. విశాల్ ఇరుంబు తిరై సినిమాల‌ను ఇప్ప‌టికే పూర్తి చేసింది స‌మంత‌. ఈ రెండు సినిమాలు త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్నాయి. తెలుగులోనూ బిజీగానే ఉంది స‌మంత‌. ఇక్క‌డ సావిత్రి బ‌యోపిక్ లో మ‌హాన‌టిలో జమున పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ పాత్ర షూటింగ్ కూడా చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. శివ‌కార్తికేయ‌న్ తో న‌టిస్తున్న సినిమా షూటింగ్ కూడా దాదాపు చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఈ ఏడాది స‌మ్మ‌ర్ లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. పైగా ఈ మ‌ధ్యే రంగ‌స్థ‌లంలోనూ త‌న పాత్ర‌ను పూర్తి చేసింది స‌మంత‌. ప్ర‌స్తుతం యు ట‌ర్న్ సినిమాలో న‌టిస్తూ బిజీగా ఉంది స‌మంత‌. దాంతో పాటు భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో శివ‌నిర్వాన సినిమాలో న‌టించ‌బోతుంది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి స‌మంత దూకుడు చూసి కుర్ర హీరోయిన్లు కూడా కుళ్లుకుంటున్నారు.

More Related Stories