English   

ఫ్యామిలీ మ్యాన్2 కి సమంత షాకింగ్ రెమ్యునరేషన్

 Samantha
2021-06-09 11:11:33

ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన సమంత ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల లిస్ట్ లో ఉంది. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా వుంది. అయితే సమంత కెరీర్ మొదట్లో గ్లామర్ పాత్రల్లో నటించి మెప్పించగా ప్రస్తుతం తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలు మరియు కథకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తోంది. అంతే కాకుండా ప్రయోగాలు చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తోంది. 

సమంత ఈ నేపథ్యంలోనే సామ్ డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఆహాలో సామ్ జామ్ పేరుతో టాక్ షోను చేసి ఆకట్టుకుంది. అంతే కాకుండా ఇటీవల విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతే కాకుండా ఇదివరకు ఎప్పుడు చేయని బోల్డ్ పాత్రలో సామ్ నటించడం సెన్సేషన్ గా మారింది. అయితే ఈ వెబ్ సిరీస్ కోసం సమంత తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా ఈ సిరీస్ కోసం సమంత నాలుగు కోట్ల రెమ్యునరేషన్ ను పుచ్చుకుందట. ఓ వెబ్ సిరీస్ కోసం ఇంత పుచ్చుకోవడం అంటే ఎక్కువేనని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More Related Stories