English   

స‌మ్మోహ‌నంగా స్పూర్థి పొందాడా..?

sammohanam copy from hollywood

ఇప్పుడు ఏ సినిమా తీసుకున్నా కూడా దానికి ఒరిజిన‌ల్ ఎక్క‌డో ఓ చోట దొరుకుతుంది. అలాగే ఇప్పుడు స‌మ్మోహ‌నం సినిమా కూడా ఓ హాలీవుడ్ సినిమాకు ఫ్రీమేక్ అనే వార్త‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో సుధీర్ బాబు, అదితి రావ్ హైద‌రీ జంట‌గా న‌టించారు. ఈ చిత్రం జూన్ 15న విడుద‌ల కానుంది. అయితే ఈ చిత్రాన్ని హాలీవుడ్ సినిమా నాటింగ్ హిల్ నుంచి ఇంద్ర‌గంటి స్పూర్థి పొంది రాసుకున్నాడ‌ని తెలుస్తుంది. పూర్తి కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఉండే ఆ స‌బ్జెక్ట్ ను మ‌న ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్లుగా మార్చి.. రొమాన్స్ ను కూడా యాడ్ చేసాడ‌ని స‌మాచారం. దానికితోడు సినిమాలో అదితి పాత్ర‌తో క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా ఇంద్ర‌గంటి చూపించాడ‌ని తెలుస్తుంది. ఈ మ‌ధ్య కాలంలో ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి బాగానే వార్త‌లు వినిపించాయి. అందుకే త‌న సినిమాలో వీటిపై ఫోక‌స్ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో అదితిరావ్ నిజంగానే హీరోయిన్ గా న‌టిస్తుంది. ట్రైల‌ర్ లోనే సినిమా ఇండ‌స్ట్రీపై భారీ సెటైర్లు క‌నిపించాయి. మ‌రి రేపు సినిమాలో ఇంకే రేంజ్ లో ఉండ‌బోతున్నాయో..? అస‌లు ఈ చిత్రం ఒరిజిన‌లా.. లేదంటే హాలీవుడ్ నుంచి అరువు తీసుకున్న క‌థా అనేది కూడా త్వ‌ర‌లోనే తేల‌నుంది. 

More Related Stories