English   

స‌మ్మోహ‌నం ఫ‌స్ట్ షో టాక్.. 

Sammohanam-first-talk

ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ-సుధీర్ బాబు కాంబినేష‌న్ లో వ‌చ్చిన స‌మ్మోహ‌నం విడుద‌లైంది. ఈ చిత్రం ప్రీమియ‌ర్స్ జూన్ 14 రాత్రే అమెరికాలో ప‌డ్డాయి. దీనికి టాక్ కూడా బాగానే వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన సుధీర్ బాబు సినిమాల‌తో పోలిస్తే కాస్త ఎక్కువ పాజిటివ్ టాక్ తో ఓపెన్ అయిన సినిమా ఇదే. అయితే సినిమా మ‌రీ నెమ్మ‌దిగా ఉండ‌టం స‌మ్మోహ‌నంకు మైన‌స్ గా మారుతుంది. ఈ చిత్రం ఊహించిన దానికంటే బాగా స్లోగా ఉంటుంద‌ని.. అయితే విష‌యం బ‌లంగా ఉండ‌టంతో ప్రేక్ష‌కుల‌కు క‌చ్చితంగా ఎక్కుతుంద‌ని తెలుస్తుంది. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ అయితే ఇంద్ర‌గంటి స్టైల్ లో సూప‌ర్ కామెడీతో వెళ్లిపోయిన స‌మ్మోహ‌నం.. సెకండాఫ్ మాత్రం కాస్త ల్యాగ్ అయిందంటున్నారు ప్రేక్ష‌కులు. ముఖ్యంగా ఎమోష‌న‌ల్ సీన్స్ అన్నీ బాగా నెమ్మ‌దిగా చేసాడు ద‌ర్శ‌కుడు. భారంగా అనిపించే విధంగా ఉన్నా కొన్ని సీన్స్ లో మాత్రం ఇండ‌స్ట్రీకి భారీ పంచ్ లు వేసాడ‌ని తెలుస్తుంది. క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇందులో కొన్ని సీన్స్ పెట్టాడు ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి. హీరోయిన్ అదితిరావ్ కారెక్ట‌ర్ తో తాను చెప్పాల‌నుకున్న‌ది చెప్పించాడు. మొత్తానికి స‌మ్మోహ‌నం స్లో అండ్ స్ట‌డీ.. మ‌రి ఇది ప్రేక్ష‌కుల‌కు ఎంత‌వ‌ర‌కు చేరుతుందో చూడాలిక‌..!

More Related Stories