English   

సుధీర్ సూప‌రంతే

sudheer-babu
2018-06-16 09:38:14

ప్రేమ‌క‌థ‌ల్లో ఎమోష‌న్ పండితేనే ఆక‌ట్టుకుంటాయి. అంటే అందుకు త‌గ్గ ఆర్టిస్టులుండాలి. అప్పుడే ఆ ఎమోష‌న్స్ ఆడియ‌న్ కు క‌నెక్ట్ అవుతాయి. మొద‌ట్లో స‌మ్మోహ‌నం అనే టైటిల్ తో ఇంద్ర‌గంటి మోహ‌న‌క్రిష్ణ సినిమా అనౌన్స్ చేసిన‌ప్పుడు చాలామంది ఆశ్చ‌ర్య‌పోయారు. కారణం హీరో సుధీర్ బాబు కావ‌డం. నిజానికి వార‌స‌త్వ‌పు కార్డ్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు న‌టుడుగా ఇంత వ‌ర‌కూ ప్రూవ్ చేసుకోలేదు. అందుకే ఇలాంటి క‌థ‌ల్లో అత‌ను హీరోగా మెప్పిస్తాడా అనుకున్నారు. బ‌ట్.. మంచి కథ ప‌డితే త‌న‌లోని న‌టుడ్నీ చూపించ‌గ‌ల‌ను అని ప్రూవ్ చేసుకున్నాడు సుధీర్. ఇవాళ విడుద‌లైన‌.. స‌మ్మోహ‌నం చేస్తాన‌ని నిరూపించుకున్నాడు. ఓ సాధార‌ణ క‌థ‌ను త‌న‌దైన రైటింగ్ టాలెంట్ తో ఇంద్ర‌గంటి మోహ‌న క్రిష్ణ బాగా హ్యాండిల్ చేశాడు. ఇలాంటి సెన్సిటివ్ స్టోరీస్ కు అలాంటి ఎక్స్ ప్రెష‌న్స్ ప‌లికించే న‌టులుంటే బావుంటుంది. సుధీర్ త‌న‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు బ్రిలియంట్ ప‌ర్ఫార్మెన్స్ తో ఆన్స‌ర్ చెప్పాడు. మొత్తంగా  మాన్ సూన్ లో ఫ‌స్ట్ తెలుగు హిట్ గా స‌మ్మోహ‌నం నిలిచింది. ఇక అదితిరావులో నిజంగానే ఓ స‌మ్మోహ‌న శ‌క్తి ఉంది. అలాగే అద్భుత‌మైన న‌ట‌న కూడా ఉంది. ఇన్నాళ్లూ త‌న‌ను వాడుకోలేక‌పోయిన బాలీవుడ్ ఈ సినిమా చూశాక ఖ‌చ్చితంగా బాధ‌ప‌డుతుంది. మొత్తంగా స‌మ్మోహ‌నంతో సుధీర్ బాబు సూప‌ర్ అనిపించుకుని.. మ‌హేష్ ఫ్యాన్స్ లో మ‌రింత ఆనందం నింపాడు. 

More Related Stories