English   

‘సమ్మోహనం’ చేసే టైమ్ చెప్పేశారు..

Sudheer-Babu-Sammohanam

ఈ మధ్య కాలంలో చాలా ఫాస్ట్ గా ఇంకా చెప్పాలంటే పూరీ ఎక్స్ ప్రెస్ కంటే ఫాస్ట్ గా సినిమాలు తీస్తోన్న దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి. జెంటిల్మన్ తర్వాత అమీతుమీ చిత్రాలను ఇలాగే ఫాస్ట్ గా తీసి మంచి హిట్లు అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను కూడా అలాగే పూర్తి చేస్తూ రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశాడు. సుధీర్ వర్మ, అదితిరావు హైదరి జంటగా ఈ మధ్యే ప్రారంభించిన సినిమా సమ్మోహనం. ప్రస్తుతం ప్రొడక్షన్ లో ఉన్న ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశాడు ఇంద్రగంటి. శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుంది.

ఈ నేపథ్యంలో సమ్మోహనంను జూన్ 15న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు దర్శకుడు. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు, హీరోయిన్ అదితిరావు కలిసిరొమాంటిక్ గా బైక్ పై వస్తోన్న ఓ ఫోటోను కూడా విడుదల చేశారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ మూవీలో ఇంకా సీనియర్ నరేష్, తనికెళ్ల భరణి, పవిత్రాలోకేష్, అర్జున్ రెడ్డి ఫేమ్ రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి పెళ్లి చూపులు ఫేమ్ వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండటం విశేషం. సమ్మోహనం అనే టైటిల్ కు పూర్తి జస్టిఫికేట్ చేసేలా కథ, కథనం ఉంటుందని గట్టిగా చెబుతున్నాడు ఇంద్రగంటి. ఏదేమైనా కథల విషయంలో కానీ, కథనంలో కూడా ఇంద్రగంటికి టాలీవుడ్ లో ఓ ప్రత్యేకత ఉంది. దాన్ని మరోసారి నిలబెట్టుకునేలా సమ్మోహనం ను తీర్చిదిద్దుతున్నాడు. మొత్తంగా జూన్ 15న సేఫ్ టైమ్ చూసుకుని మరీ రిలీజ్ డేట్ కూడా ప్లాన్ చేసుకుని తెలివి చూపించాడు. 

More Related Stories