English   

స‌మ్మోహ‌నం రివ్యూ

Sammohanam-Review
2018-06-15 05:55:19

ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ సినిమా అంటేనే ఏదో తెలియ‌ని పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఇప్పుడు స‌మ్మోహ‌నం కూడా అలాంటి అంచ‌నాల‌తోనే వ‌చ్చింది. సుధీర్ బాబు, అదితి జంట‌గా వ‌చ్చిన ఈ చిత్రంలో ఇండ‌స్ట్రీపై సెటైర్లు కూడా బాగానే ఉన్నాయి. మ‌రి ఎప్ప‌ట్లాగే ఈ ద‌ర్శ‌కుడు మ‌రోసారి మాయ చేసాడా..? 

క‌థ‌: విజ‌య్(సుధీర్ బాబు) ఆర్టిస్ట్. ఎప్ప‌టికైనా పెద్ద ఆర్టిస్ట్ అవ్వాల‌ని క‌ల‌లు కంటుంటాడు. ఇక ఆయ‌న తండ్రికి సినిమాల పిచ్చి ఉంటుంది. ఎప్ప‌టికైనా న‌టుడు అవ్వాల‌ని ఆశ‌. అలాంటి స‌మ‌యంలో త‌న ఇంట్లో షూటింగ్ చేసుకోవాలంటూ ఓ ద‌ర్శ‌కుడు అడుగుతాడు. దానికి బ‌దులుగా సినిమాలో కారెక్ట‌ర్ అడుగుతాడు హీరో తండ్రి(న‌రేష్). ఆ సినిమాలో హీరోయిన్ స‌మీరా రాథోర్ (అదితిరావ్). అక్క‌డ షూటింగ్ జ‌రుగుతున్న‌పుడు విజ‌య్ తో స‌మీరాకు ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. సినిమాలంటే పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌ని విజ‌య్ కూడా స‌మీరాను ప్రేమిస్తాడు. త‌న ప్రేమ గురించి చెప్తాడు కానీ ఆమె ఒప్పుకోదు. ఆ త‌ర్వాత ఏమైంది..? ఇద్ద‌రూ ఎలా క‌లిసారు అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం: హీరోయిన్ కు హీరో ప్రేమ‌తో త‌న చిన్న‌నాటి ముచ్చ‌ట్లు అన్నీ చెబుతుంటాడు.. అక్క‌డ జ‌రిగిన సీన్ అచ్చంగా ఆ అమ్మాయిన న‌టించిన సినిమాలో హీరో చూస్తాడు.. వెంట‌నే సినిమా వాళ్లంటే మోసం అంటూ ఫిక్సైపోతాడు. స‌మ్మోహ‌నంలో ఇలాంటి సీన్స్ చాలానే ఉన్నాయి. ఇండ‌స్ట్రీని టార్గెట్ చేస్తూనే కొన్ని సీన్లు రాసుకున్నాడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌. అలాగే ఇండ‌స్ట్రీలో కొంద‌రు త‌మ వార‌సుల‌ను ప్రేక్ష‌కులపై ఎలా రుద్దుతున్నారో చెప్ప‌డానికి కూడా ఓ డైలాగ్ పెట్టాడు ఈ ద‌ర్శ‌కుడు. ఓ వైపు ఇలాంటి సీన్లు చూపిస్తూనే మ‌రోవైపు ఇండ‌స్ట్రీలో అంతా చెడే ఉండ‌దు మంచి కూడా ఉంటుంద‌ని చెప్పాడు. దానికితోడు ప్రేమ స‌న్నివేశాల‌ను కూడా చాలా బాగా రాసుకున్నాడు ఇంద్ర‌గంటి. సినిమాలో జ‌రిగే ప్ర‌తీ సీన్ మ‌న జీవితంలో కూడా ఎక్క‌డో ఓ చోట‌.. ఎప్పుడో ఓ సారి జ‌రుగుతున్న‌ట్లే అనిపిస్తుంది. అంత స‌మ్మోహ‌నంగా క‌థ ముందుకు వెళ్తుంది. హీరోయిన్ వ‌చ్చి త‌మ ఇంట్లో షూటింగ్ చేసుకోవ‌డం.. ఆ కుర్రాడంటే అమ్మాయి ఇష్ట‌ప‌డ‌టం కాస్త ఊహ‌కు అంద‌ని విధంగా ఉంటుంది కానీ దాన్ని కూడా న‌మ్మేలా తీర్చిదిద్దాడు ఈ ద‌ర్శ‌కుడు. హీరో హీరోయిన్ మ‌ధ్య ప్రేమ కూడా చాలా మెచ్యూర్డ్ గా చూపించాడు ద‌ర్శ‌కుడు. ప్రేమ విఫ‌ల‌మై బాధ ప‌డుతున్న హీరోను త‌ల్లి వ‌చ్చి ఓదారుస్తుంది. ప్రేమించేవాడు కాదు.. అమ్మాయి నో చెప్పినా ఓర్చుకునేవాడే అస‌లైన మ‌గాడంటే అంటుంది. సినిమాలో ప్రేమను ద‌ర్శ‌కుడు ఎలా చూపించాడో చెప్ప‌డానికి ఈ ఒక్క సీన్ చాలేమో. క్లైమాక్స్ వ‌ర‌కు ఎక్క‌డా గాడి త‌ప్ప‌కుండా క‌థ‌ను న‌డిపించాడు ద‌ర్శ‌కుడు. స్క్రీన్ ప్లే మాయాజాలంతో స‌మ్మోహ‌నప‌రిచాడు. 

న‌టీన‌టులు: సుధీర్ బాబు అద్భుతంగా న‌టించాడు. కెరీర్ బెస్ట్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ హీరో. ఇక అదితిరావ్ హైద్రీ అయితే అద్భుతం. ఇన్నాళ్లూ ఈ హీరోయిన్ ను తెలుగు ద‌ర్శ‌కులు ఎందుకు వ‌దిలేసామా అని ఫీల్ అవుతారు ఈ చిత్రం చూసిన త‌ర్వాత‌. అంత బాగా న‌టించింది ఈ ముద్దుగుమ్మ‌. ఇక న‌రేష్ మ‌రోసారి త‌న న‌ట‌న‌తో మాయ చేసారు. న‌వ్వించారు.. ఏడిపించారు కూడా. ప‌విత్ర లోకేష్ హీరో త‌ల్లిగా చాలా బాగా చేసింది. ఫ్రెండ్స్ గా రాహుల్ రామ‌కృష్ణతో పాటు పెళ్లి చూపులు ఫేమ్ మ‌రో అబ్బాయి కూడా బాగా న‌టించాడు. 

టెక్నిక‌ల్ టీం: స‌మ్మోహ‌నం క్రెడిట్ లో చాలా భాగం సినిమాటోగ్ర‌ఫ‌ర్ పిజి విందాకు వెళ్తుంది. ఈయ‌న త‌న కెమెరా ప‌నిత‌నంతో మాయ చేసాడు. విజువ‌ల్స్ ను చాలా అద్భుతంగా చూపించాడు.. సినిమా రేంజ్ పెంచేసాడు. ఇక పెళ్లిచూపులు త‌ర్వాత మ‌రోసారి త‌న మ్యాజిక్ తో మాయ చేసాడు వివేక్ సాగ‌ర్. ఎడిటింగ్ బాగుంది. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ మ‌రోసారి త‌న స్పెషాలిటీ చూపించాడు. తెలిసిన స‌న్నివేశాల‌ను అందంగా రాసుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇక ఈయ‌న తెర‌కెక్కించిన విధానం చూసి ఎవ‌రైనా ఫిదా అయిపోవాల్సిందే. అద్భుతమైన టేకింగ్ తో మాయ చేసాడు. కాక‌పోతే కాస్త నెమ్మ‌దిగా సాగ‌డం ఒక్క‌టే ఈ చిత్రానికి మైన‌స్.

చివ‌ర‌గా: స‌మ్మోహ‌నం.. మైమ‌రిపించిన స‌మ్మోహ‌నం..

రేటింగ్: 3/5

More Related Stories