English   

‘సమ్మోహనం’ చేసేలానే ఉన్నారే..

sudheer-babu

తెలుగులో ‘ప్యూర్’ మూవీస్ తీసే దర్శకుల్లో ఇంద్రగంటి మోహన కృష్ణ ఒకడు. సిన్సియర్ గా ప్రయత్నాలు చేస్తాడీ దర్శకుడు. ఇంతకు ముందు జెంటిల్మన్, అమీతుమీ చిత్రాలతో వరస విజయాలు అందుకున్న మోహనకృష్ణ ఇప్పుడు సమ్మోహనం అనే ప్రేమకథతో వస్తున్నాడు. సుధీర్ బాబు, అదితిరావు జంటగా నటించిన ఈ సినిమా టీజర్ ఇవాళ విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి ఆశిస్సులతో ఈ టీజర్ విడుదల చేసింది టీమ్. టైటిల్ కు తగ్గట్టుగానే సమ్మోహనం చేసేలా ఉన్నాడు ఇంద్రగంటి. ముఖ్యంగా అదితి, సుధీర్ ల మధ్య కెమిస్ట్రీ టీజర్ లోనే అదిరిపోయింది. 

ఓ సాధారణ కుర్రాడు ఓ సినిమా హీరోయిన్ మధ్య నడిచే ప్రేమకథ అని తెలిసిపోయింది. మరి ఈ కథలో ఎన్ని ట్విస్టులుంటాయి. ఎలాంటి కాన్ ఫ్లిక్ట్స్ ఉంటాయనేది టీజర్ చూస్తేనే తెలుస్తంది. ఎందుకంటే సినిమా ఆరంభంలోనే హీరోకు సినిమాలంటే ఇష్టంలేదు అన్న విషయం చెప్పాడు. కట్ చేస్తే అతను హీరోయిన్ తో కలిసి ప్రయాణం చేయాల్సి వస్తుందేమో అన్నట్టుగా సాగే కథనంగా అనిపిస్తోంది. అలాగే హీరోయిన్ ను ఉద్దేశిస్తూ సుధీర్ చెప్పిన డైలాగ్స్, నేను కూడా కెరీర్ కోసం, సక్సెస్ కోసం కాంప్రమైజ్ అయ్యానని అనుకుంటున్నావా అని అదితి అడిగే డైలాగ్స్ అదిరిపోయాయి. బట్ ఈ టీజర్ లో అత్యంత అందంగా కనిపిస్తోన్న విషయం( ఇది నిజమే అయితే) అదితి తనే డబ్బింగ్ చెప్పుకున్నట్టు కనిపిస్తోంది. ఓ హీరోయిన్ పాత్ర చేసింది కాబట్టి యాక్సెంట్ కాస్త తేడాగా ఉన్నా సరిపోతుంది. ఎలాగూ తను తెలుగమ్మాయే కాబట్టి.. డబ్బింగ్ చెప్పించినా చెప్పించి ఉండొచ్చు.

చాలా తక్కువ టైమ్ లనే ఫినిష్ అయిన ఈ సినిమా లొకేషన్స్ తో పాటు సినిమాటోగ్రఫీ కూడా సింప్లీ సూపర్బ్ గా కనిపిస్తోంది. ఇంద్రగంటి సినిమాల్లో ఉండే ఒక రకమైన క్లెవర్ నెస్ ఈ టీజర్ లోనే కనిపిస్తోంది. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ మూవీకి పెళ్లి చూపులు ఫేమ్ వివేక్ సాగర్ సంగీతం అందించాడు. సినిమాటోగ్రఫీ పిజి విందా.. 

More Related Stories