English   

సంపూ ఆ ప్ర‌శ్న‌కి ఎంత ఖుషీ అయ్యాడో!

Sampoo-Aa-Prashnaki-Entha-Kushi-Ayyado
2017-05-11 00:56:37

మామూలుగా అయితే ఒక  హీరో స్టార్ అనిపించుకోవ‌డానికి చాలా స‌మ‌య‌మే ప‌డుతుంది. వ‌ర‌స‌గా విజ‌యాలు అందుకొంటూ, మాస్ ప్రేక్ష‌కుల‌కు చేరువైతే త‌ప్ప‌... వాళ్ల‌ని  స్టార్ హీరో అని గుర్తించ‌లేం. కానీ సంపూ అలా కాదు. తొలి సినిమాతోనే స్టార్ అయిపోయాడు. ఇంకా చెప్పాలంటే తొలి సినిమా రాక‌మునుపే ఆయ‌న్ని స్టార్‌గా గుర్తించారంతా. ఇక తొలి సినిమా `హృద‌య‌కాలేయం` విడుద‌ల‌య్యాక బ‌ర్నింగ్ స్టార్ అంటూ  మొత్తం ఊరూ వాడ కోడై కూసింది. ఆ దెబ్బ‌తో మ‌నోడికి అవ‌కాశాలే అవ‌కాశాలు. ప్ర‌స్తుతం సోలో క‌థానాయ‌కుడిగా త‌న రెండో సినిమా `కొబ్బ‌రిమ‌ట్ట‌`ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. ఇంత‌లో ఆయ‌న పుట్టిన‌రోజు వ‌చ్చింది.

ఈ సంద‌ర్భంగా నిన్న‌నే హైద‌రాబాద్‌లో మీడియాతో స‌మావేశ‌మ‌య్యాడు సంపూ. అక్క‌డ మ‌నోడికి ఎదురైన ఓ కీల‌క‌మైన  ప్ర‌శ్న ఏంటో తెలుసా? ఇత‌ర హీరోల్లాగా మీరు కూడా ఇత‌ర భాష‌ల్లో మార్కెట్ పెంచుకొనే ప్ర‌య‌త్నాలేమైనా చేస్తున్నారా? అని! ఆ ప్ర‌శ్న ఎదుర‌య్యేస‌రికి  సంపూ మొహం వెలిగిపోయింది. కాసేపు న‌వ్వు ఆపుకోలేక‌పోయాడు. ఆ త‌ర్వాత అతి క‌ష్ట‌మ్మీద త‌మాయించుకొని... ``మీ మీడియా అండ ఉంటే ఎక్క‌డికైనా వెళ‌తాను సార్‌, హాలీవుడ్‌లో అవ‌కాశాలు వ‌చ్చినా చేస్తా`` అంటూ స‌మాధాన‌మిచ్చాడు. మొత్తంగా మీడియాతో సంపూ ఇంట‌రాక్ష‌న్ భ‌లే స‌ర‌దాగా సాగింది. `కొబ్బ‌రిమ‌ట్ట` సినిమాపై  సంపూ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఆ సినిమా త‌ర్వాత సోలోగా మ‌రో రెండు సినిమాలు విడుద‌ల కాబోతున్నాయ‌ట‌.

More Related Stories