English   

సంపూర్ణేష్ బాబుకు తప్పిన ప్రమాదం 

Sampoornesh Babu
2021-01-23 16:23:19

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం "బజార్ రౌడీ" సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే షూటింగ్ లో భాగంగా ఓ స్టెంట్ సీన్ చిత్రిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంపూర్ణేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న " బజార్ రౌడీ " సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది.  ఈ సినిమాకు వసంత నాగేశ్వర్ రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమాకు సంది రెడ్డి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే షూటింగ్ లో భాగంగా సంపూర్ణేష్ బైక్ ను పైకి లేపి సంచులపై దూకే సీన్ ఉంది. కాగా బైక్ పైకి లేచి కిందకి దూకే సమయంలో ఒక్కసారిగా ప్రమాదం చోటు చోటుచేసుకుంది. దాంతో వెంటనే పక్కనున్న వారు సంపూను పైకి లేపారు. ఆయనకు ఎలాంటి గాయాలు తగలకపోవడంతో యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా సంపూర్ణేష్ బాబు "హృదయకాలేయం" సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు లభించడంతో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఓ వైపు హీరోగా నటిస్తూ మరోవైపు సైడ్ క్యారెక్టర్ లు చేస్తున్నాడు.

More Related Stories