English   

సినీ నటిపై ప్రైవెట్ కంపెనీ సీఈఓ అత్యాచారం

sandalwood actress
2020-07-05 17:44:16

ఓ కన్నడ నటిపై ప్రైవెట్ కంపెనీకి చెందిన సీఈఓ అత్యాచారానికి పాల్పడి..వీడియో తీసిన విషయం బయటపడింది. కన్నడ తమిళ సినిమాలలో నటించిన నటికి.. 2018లో బసవగుడి గాంధీబజార్ కాఫీ షాప్ లో ఓ ఫ్రైవెట్ కంపేనీకి చెందిన సీఈఓ పరిచయమయ్యాడు. ఆ తరువాత ఇద్దరి మధ్య సన్నిహత్యం పెరిగి.. ఆమెను తన కంపెనీలోనే ప్రచార రాయభారిగా నియమించుకున్నాడు.  2019 లో జూన్ లో తన పుట్టినరోజున ఇంట్లో పార్టీకి ఆమెను ఆహ్వనించాడు. ఈ పార్టీలో ఆమెకు కూల్ డ్రీంక్ లో మత్తుమందు కలిపి ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఆ దృశ్యాలను వీడియో తీశాడు. 

అదే నెల జూన్‌ 24న వీడియోను ఆమెకు చూపించి డబ్బు ఇవ్వాలని, లేకపోతే సోషల్ ‌మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆ నటి రూ.11 లక్షలు సమర్పించుకుంది. తరచు బ్లాక్‌మెయిల్‌ చేసి అత్యాచారం చేయడమే కాకుండా డబ్బులు  గుంజేవాడు.  దీంతో వాడి భాధను తట్టుకోలేక నటి  తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు  మోహిత్, అతడి తండ్రి మహదేవ్, తల్లి నాగవేణి, రాహుల్‌ అనే వారిపై కేసులు నమోదు చేసి గాలింపు చేపట్టారు.

More Related Stories