English   

 కుర్రాడు క‌న్ఫ‌ర్మ్ చేసాడుగా..!

sandeep-mahesh
2018-04-28 17:26:07

ఇక అనుమానాలు అవ‌స‌రం లేదు. అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడితో మ‌హేశ్ బాబు సినిమా ఉండ‌బోతుంది. దీనిపై కావాల్సిన వాళ్ల నుంచే రావాల్సిన క్లారిటీ వ‌చ్చేసింది. స్వ‌యానా ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగానే తాను మ‌హేశ్ బాబుతో సినిమా చేయ‌బోతున్న‌ట్లు అనౌన్స్ చేసాడు. ఈయ‌న ప్ర‌స్తుతం హిందీ అర్జున్ రెడ్డితో బిజీగా ఉన్నాడు. ఇందులో షాహిద్ క‌పూర్ హీరోగా న‌టించ‌బోతున్నాడు. ఇదే ఏడాది సినిమా పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు ద‌ర్శ‌కుడు సందీప్. ఈ చిత్రం పూర్తైన త‌ర్వాత మ‌హేశ్ సినిమాపై దృష్టి పెట్ట‌నున్నాడు సందీప్ రెడ్డి వంగా. మొన్న భ‌ర‌త్ అనే నేను స‌క్సెస్ మీట్ కు సందీప్ రెడ్డి వంగా వ‌చ్చాడు. అక్క‌డ బ‌య‌టి ద‌ర్శ‌కుడు ఈయ‌న ఒక్క‌డే ఉన్నాడు. కొర‌టాల ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు.. వంశీ పైడిప‌ల్లితో మ‌హేశ్ సినిమా చేయ‌బోతున్నాడు కాబ‌ట్టి వాళ్లున్నారు. అక్క‌డ సందీప్ రెడ్డి క‌నిపించిన‌పుడే ఆయ‌న మ‌హేశ్ తో సినిమా చేయ‌బోతున్నాడ‌నే సంగతి అర్థ మైపోయింది. ఇప్పుడు అదే క‌న్ఫ‌ర్మ్ చేసాడు ద‌ర్శ‌కుడు కూడా. తాను మ‌హేశ్ తో చేయ‌బోయే సినిమా చాలా కొత్త‌గా ఉంటుంద‌ని.. ఆయ‌న కోస‌మే క‌థ సిద్ధం చేస్తున్నానని చెప్పాడు సందీప్. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ త‌ర్వాత ఈ సెన్సేష‌న‌ల్ కాంబినేష‌న్ చూడొచ్చు.       

More Related Stories