English   

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడితో రామ్ చ‌ర‌ణ్.. 

Sandeep-Reddy

ఈ రోజుల్లో ఎన్ని సినిమాలు చేసామ‌న్న‌ది కాదు.. ఎలాంటి సినిమాలు చేసాం అన్న‌దే కీల‌కం. అచ్చంగా అదే లెక్క‌లో గ‌తేడాది తెలుగు ఇండ‌స్ట్రీకి సందీప్ రెడ్డి అనే సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు వ‌చ్చాడు. గ‌తేడాది ఎన్ని సినిమాలైనా వ‌చ్చుండొచ్చు కానీ అర్జున్ రెడ్డి మాత్రం ప్ర‌త్యేకం. ఈ చిత్రం అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ట్రెండ్ ను బ్రేక్ చేసింది. శివ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ ట్రెండ్ సెట్ట‌ర్ అనే ప‌దానికి నిద‌ర్శ‌నంగా నిలిచింది ఈ చిత్రం. పాత్ బ్రేకింగ్ హిట్ గా అవ‌త‌రించింది. ఈ ద‌ర్శ‌కుడి గ‌ట్స్ కు అంతా ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడి రెండో సినిమాపై ఇండ‌స్ట్రీలో కావాల్సిన‌న్ని వార్త‌లు వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డితో మ‌హేశ్ సినిమా చేస్తాడ‌నే వార్త‌లు ఆ మ‌ధ్య వినిపించాయి. ఇందులో నిజం ఎంతుందో తెలియ‌దు కానీ చ‌ర‌ణ్ తో మాత్రం క‌చ్చితంగా ఈయ‌న సినిమా చేయ‌బోతున్నాడు. 

ఈ మ‌ధ్య మెగా కంపౌండ్ లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. మొన్నామ‌ధ్య చ‌ర‌ణ్ ఇచ్చిన పార్టీలో క‌నిపించాడు. ఇక ఇప్పుడు రంగ‌స్థ‌లం స‌క్సెస్ పార్టీలోనూ చ‌ర‌ణ్, చిరుతో క‌లిపి పోజ్ ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ పార్టీలో వంశీ పైడిప‌ల్లి మాత్ర‌మే బ‌య‌టి ద‌ర్శ‌కుడు ఉన్నాడు. ఇక ఆయ‌న‌తో పాటే సందీప్ రెడ్డి వంగా క‌నిపించాడు. అంటే ఈయ‌న రామ్ చ‌ర‌ణ్ తో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడ‌ని అర్థం. పైగా ఈ ఫోటోను ఉపాస‌న ట్వీట్ చేయ‌డం విశేషం. ఈ కాంబినేష‌న్ లో సినిమా రావ‌డం కాస్త ఆల‌స్యం కావ‌చ్చేమో కానీ రావ‌డం మాత్రం ప‌క్కా. ప్ర‌స్తుతానికి బోయ‌పాటి.. రాజ‌మౌళి.. కొర‌టాల శివ‌ సినిమాల‌తో బిజీగా ఉన్న చ‌ర‌ణ్.. సందీప్ రెడ్డి సినిమాను కూడా ఓకే చేస్తాడేమో మ‌రి..! మొత్తానికి ఈ కుర్ర ద‌ర్శ‌కుడి సంచ‌ల‌నాలు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి.

More Related Stories