English   

క్యాన్సర్ ను జయించిన సంజయ్ దత్

Sanjay Dutt
2020-10-22 10:08:42

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇటీవల క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. సంజయ్ దత్ అస్వస్థతకు గురవ్వడం తో ఆస్పత్రిలో చేరగా ఆయనకు క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దాంతో ఆయన ముంబై లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అంతేకాకుండా దుబాయ్ వెళ్లి కూడా చికిత్స తీసుకున్నారు. కాగా తాజాగా సంజయ్ దత్ ఆయన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను క్యాన్సర్ ను జయించానని పేర్కొన్నారు. "దేవుడు గొప్ప యోధులకు మాత్రమే కష్టమైన పోరాటాలను ఇస్తాడు..నేను కూడా అలాగే ఈ యుద్ధంలో పోరాడి గెలిచాను. నా పిల్లల పుట్టినరోజు వరకు నేను పూర్తి ఆరోగ్యవంతుడిగా ఉండటం దేవుడు ఇచ్చిన కానుక. అభిమానులు, కుటుంబీకుల ప్రార్థనలు, విశ్వాసం వల్లనే క్యాన్సర్ ను జయించాను. విశ్వసం అభిమానుల ప్రార్థనలు లేకుంటే జయించలేకపోయేవాడిని. ఇది అంత సులబమైనది కాదు. నాకు వైద్యం అందించిన ఆస్పత్రి వైద్యులకు, సిబ్బందికి ఋణపడి ఉంటాను" అని సంజు పేర్కొన్నాడు. 

ఇక సంజయ్ దత్ కేజీఎఫ్ షూటింగ్ లో పాల్గొంటున్నా అని చెప్పడంతో ఆయన అభిమానులు షాక్ కి గురయ్యారు. స్టేజ్ 3 లంగ్ క్యాన్సర్ లో ఉన్న సంజయ్ షూటింగ్ లో పాల్గొనటం ఏంటి అని ఆశ్చర్యపోయారు. ఇక తాజాగా ఆయన క్యాన్సర్ ను జయించానని చెప్పడం తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. క్యాన్సర్ ను జయించి సంజూ నిజమైన అధీర అనిపించుకున్నదంటూ కామెంట్లు పెడుతున్నారు.

More Related Stories