English   

సంజయ్ దత్ టెన్షన్ లో కేజీఎఫ్ టీమ్

Sanjay Dutt
2020-08-14 14:33:08

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ 2. కె.జి.ఎఫ్ ఏమేరకు సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమా కన్నడలోనే కాక తెలుగు, తమిళ, హింది భాషల్లో కూడా భారీ విజయాన్ని సాధించింది. కె.జి.ఎఫ్‌ సినిమా జోరుతో కె.జి.ఎఫ్‌- చాప్టర్ 2 కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. మొదటి పార్ట్ కి వచ్చిన క్రేజ్ దృష్ట్యా బాలీవుడ్ సహా కొన్ని బాషలలో కీలకమైన పాత్రల కోసం స్టార్ నటులను ఈ సినిమాలో నటింప చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ మెయిన్‌ విలన్‌ అధీరా పాత్రలో నటిస్తుండటం అలాగే లేడీ ప్రధానమంత్రిగా రవీనా టాండన్‌ నటిస్తుండడంతో ఈ సినిమా మీద ఇంకా అంచనాలు పెరిగిపోయాయి. అయితే రెండ్రోజుల క్రితం క్యాన్స‌ర్‌లో బాధ‌ప‌డుతున్న సంజ‌య్ ద‌త్ అమెరికాకు పయనం అయ్యారు.

అయితే ఆయన క్యాన్సర్ బారిన పడడంతో కేజీఎఫ్ 2 రిలీజ్‌ మీద నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. ఎందుకంటే సంజ‌య్ ద‌త్‌కు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్త‌యింద‌ని అంటున్నా అధీరా పాత్ర‌కు డ‌బ్బింగ్ మాత్రం ఇంకా చెప్పాల్సి ఉందని అంటున్నారు. అయితే క్యాన్స్‌ర్ కు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న సంజ‌య్‌ద‌త్ తిరిగి రావాలంటే ఎంత తక్కువ లేక్కేసుకున్నా మూడు నాలుగు నెల‌లు ప‌డుతుంద‌ని, ఆ త‌రువాతే సంజ‌య్ ఈ చిత్రానికి సంబంధించిన బ్యాలెన్స్ షూటింగ్‌లో పాల్గొంటార‌ని చెబుతున్నారు. దీంతో కేజీఎఫ్ టీమ్ అంతా టెన్షన్ లో ఉన్నట్టు చెబుతున్నారు.

More Related Stories