English   

అధీర న్యూ హెయిర్ స్టైల్...సూపర్ అంటున్న ఫ్యాన్స్

Sanjay Dutt
2020-10-31 10:18:45

బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ ఇటీవల క్యాన్సర్ మహమ్మారి భారిన పడిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన ముంబై, దుబాయ్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నారు. దాంతో అభిమానులు కోరుకున్నట్టుగానే సంజయ్ అతి తక్కువ కాలంలో క్యాన్సర్ ను జయించారు. అనంతరం ఆయన తన కుమారుడి పుట్టినరోజు వేడుకలకు కూడా హాజరయ్యారు. అయితే క్యాన్సర్ ను జయించిన తరవాత సంజయ్ దత్ ఎయిర్ పోర్ట్ లో దిగిన ఓ ఫోటో వైరల్ అయింది. ఆ ఫొటోలో సంజయ్ దత్ చాలా సన్నగా కనిపించారు. దాంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఆ తరవాత సంజూ బాయ్ తాను క్యాన్సర్ ను జయించానని త్వరలోనే కేజీఎఫ్ షూట్ లో పాల్గొంటున్నట్టు కూడా ప్రకటించారు. దాంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక తాజాగా సంజయ్ దత్ మరో ఫోటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఫోటోలో సంజయ్ సరికొత్త లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ముంబై లోని ప్రముఖ హెయిర్ స్టయిలిష్ ఆలిమ్ హకీమ్ సెలూన్ లో సంజయ్ కంటింగ్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్ ఫోటోని ఆలిమ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే సంజయ్ దత్ ప్రస్తుతం కేజీఎఫ్ 2, శంషెరా, పృద్విరాజ్ చిత్రాలలో నటిస్తున్నాడు.

More Related Stories