English   

సంజయ్ గాంధీతో ఆ స్టార్ హీరో అత్తకు ఎఫైర్ ఉండేదా..

sanjay
2020-05-24 16:40:51

సంజయ్ గాంధీ.. ఈ తరానికి పేరుతో పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ గత తరానికి మాత్రం ఈయన పేరు బాగా తెలుసు. అమ్మ ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నపుడు చాలా దూకుడుగా ఉండేవాడు సంజయ్ గాంధీ. ఈయన చేసిన కొన్ని దుందుడుకు పనులు అప్పట్లో ఇందిరాను సైతం ఇబ్బందుల్లో పడేసాయనే వార్తలున్నాయి. చివరికి చాలా చిన్న వయసులోనే విమాన ప్రమాదంలో చనిపోయాడు సంజయ్. ఇదిలా ఉంటే ఈయన మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీకి భర్త కాగా... మరో బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి తండ్రి. అప్పట్లో ఈయన చేసే పనులు చూసి అమ్మకు సైతం కోపం వచ్చేదని చాలా మంది చెప్తున్న మాట. అయితే ఈయనకు బాలీవుడ్ హీరోయిన్లతో కూడా లింకులు ఉన్నట్లు ఇప్పుడు ప్రచారం జరుగుతుంది.

అందులోనూ మరీ ముఖ్యంగా నిన్నటి తరం హీరోయిన్ అమృతా సింగ్ తల్లి రుక్సానా సుల్తాన్ తో సంజయ్ గాంధీ ఎఫైర్ నడిపించాలని ప్రస్తుతం కొన్ని వార్తలు వస్తున్నాయి. సంజయ్ గాంధీకి దగ్గరగా ఉన్న వాళ్లు ఎమర్జెన్సీ సమయంలో బాగా లాభపడ్డారు. అలాంటి వాళ్లలో సినీ నటి అమృతా సింగ్ తల్లి రుఖ్సానా సుల్తాన్ ఒకరని తెలుస్తుంది. ఈమె ఎవరో కాదు.. సైఫ్ అలీ ఖాన్ అత్తగారు. తనకంటే వయసులో 12 ఏళ్లు పెద్దదైన అమృతా సింగ్ ను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు ఇచ్చి కరీనా కపూర్ ను పెళ్లి చేసుకున్నాడు సైఫ్. ఇదిలా ఉంటే దేశాన్ని ఊపేసిన ఎమర్జెన్సీ సమయంలో రుఖ్సానా కూడా చాలానే అధికారం చెలాయించేవారని ఇప్పుడు కొన్ని కథలు వినిపిస్తున్నాయి. అధికారాన్ని ఆమె ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకున్నారన్న వార్తలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో సంజయ్ పేరుతో రుక్సానా జామా మసీదు సుందరీకరణ చేసుకున్నారన్న ప్రచారమూ ఉంది. అయితే ఈ విషయాలు చెప్పేందుకు అప్పట్లో ఎవరూ సాహసం చేయలేదని.. అంతా నోరు మూసుకుని ఉండేవారని తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఇప్పుడు బయటికొస్తున్న ఈ విషయాలు బాలీవుడ్ ను ఊపేస్తున్నాయి.

 

More Related Stories