English   

సంజూకు టార్చర్ మొద‌లైంది..

sanju

ఏంట‌బ్బా.. సంజూ ట్రైల‌ర్ విడుద‌లై ఇన్ని రోజులు అవుతుంది.. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంకా ఎవ‌రూ ఏ వివాదం సృష్టించ‌డం లేదు అనుకుంటున్నారంతా. కొంప‌దీసి ఏ వివాదం లేకుండానే సంజూ విడుద‌ల‌వుతుందా.. ఎంత విచిత్రం ఇది అనుకున్నారు. ఇలాంటి టైమ్ లో వ‌చ్చేసింది వివాదం. ట్రైల‌ర్ చూసిన ఇన్ని రోజుల త‌ర్వాత ఓ సామాజిక కార్య‌క‌ర్త మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయి. అందులో ఈయ‌న మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా ఏమున్నాయి.. అస‌లు సంజ‌య్ ద‌త్ కే ఇబ్బందులు లేన‌పుడు అనుకుంటున్నారా..? ఉంటాయి.. ఏదో ఒక‌టి ఉంటాయి.. ఇప్పుడు ఆయ‌న మ‌న‌సుకు గాయం చేసిన సీన్.. ట్రైల‌ర్ లో సంజ‌య్ జైల్లో ఉన్న‌పుడు బాత్రూమ్ వాట‌ర్ బ‌య‌టికి రావ‌డం. ఈ సన్నివేశాన్ని వెంట‌నే తొలగించాలని సామాజిక కార్యకర్త పృథ్వీ డిమాండ్ చేస్తున్నాడు. ఈ మేరకు అత‌డు సెన్సార్ బోర్డు ఛైర్మన్ ప్రసూన్ జోషికి లెట‌ర్ కూడా రాసాడు. ఇప్ప‌టి వ‌ర‌కు తాను పొందిన స‌మాచారం ప్ర‌కారం ఏ జైల్లో కూడా ఇంత దారుణ‌మైన సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌లేద‌ని.. జైలు నిర్వహణలో ఎంతో శ్రద్ద తీసుకుంటున్నారని పృథ్వీ తన లేఖలో రాసాడు. కానీ జైల్లో మాత్రం ఇలా ఉన్న‌ట్లు చిత్రీక‌రించ‌డం దారుణం అంటున్నాడు ఈ వ్య‌క్తి. వెంట‌నే ఈ సీన్ సినిమాలో నుంచి తొల‌గించాలి అని డిమాండ్ చేస్తున్నాడు ఈయ‌న‌. మొత్తానికి సంజూకు టార్చ‌ర్ మొద‌లైంది. జూన్ 29న విడుద‌ల కానుంది ఈ చిత్రం. 

More Related Stories