English   

సంజూ.. మామూలు అరాచ‌కం కాదబ్బా..!

Sanju-Rajkumar-Hirani
2018-07-07 13:10:57

ఆయ‌న జీవితం నాశ‌న‌మైందేమో కానీ ఇప్పుడు ఆయ‌న జీవితంతో తీసిన సినిమా మాత్రం నాశ‌నం కాలేదు. అది బాక్సాఫీస్ ను శాసిస్తుంది. అత‌డే సంజూ.. సంజ‌య్ ద‌త్. ఈయ‌న బ‌యోపిక్ ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డుల‌ను సృష్టిస్తూ ముందుకెళ్తుంది. ఈ చిత్రం ఇంత‌టి రికార్డులు సృష్టిస్తుందంటే దాని వెన‌క ఉన్న మాస్ట‌ర్ బ్రెయిన్ రాజ్ కుమార్ హిరాణీ. ఆయ‌న చేసాడు కాబ‌ట్టే ఈ చిత్రం ఇంత‌గా సంచ‌ల‌నాలు చేస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు వారం రోజుల్లో ఇండియాలోనే 202 కోట్లు.. ఓవ‌ర్సీస్ తో క‌లిపి 280 కోట్లు వ‌సూలు చేసింది. చూస్తుంటే ఫుల్ ర‌న్ లో 400 కోట్ల మార్క్ అందుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే 230 కోట్ల‌కు పైగా వ‌సూలు చేయాలి. కానీ ఇప్పుడు ఆ మార్క్ దాటి రెండింత‌లు తీసుకొచ్చేందుకి రెడీ అయ్యాడు సంజూ. అన్న‌ట్లు ర‌ణ్ బీర్ క‌పూర్ కు కూడా ఐదేళ్ల త‌ర్వాత అస‌లైన విజ‌యం వ‌చ్చింది. ఈయ‌న కెరీర్ చాలా ఏళ్లుగా డ‌ల్ పీరియ‌డ్ లో ఉంది. అనుకున్న‌ట్లుగానే సంజూ వ‌చ్చి ర‌ణ్ బీర్ ను బ‌తికించాడు. మొత్తానికి వ‌ర‌స‌గా ఐదో విజ‌యాన్ని అందుకుని ఔరా అనిపించాడు రాజ్ కుమార్ హిరాణి. 

More Related Stories