సంజూ కుమ్మేస్తున్నాడు బాబోయ్..!

బాలీవుడ్ రాజమౌళి మరోసారి సంచలనం సృష్టిస్తున్నాడు. అదేంటి.. ఎవరా బాలీవుడ్ రాజమౌళి అనుకుంటున్నారా..? ఇంకెవరు ఉన్నాడు కదా.. రాజ్ కుమార్ హిరాణి. ఇండియాలో ఇప్పటివరకు ఇన్ని రికార్డులు సృష్టిస్తూ వరసవిజయాలు అందుకుంటున్నది బహుశా ఇద్దరే ఇద్దరు దర్శకులు రాజమౌళి అండ్ రాజ్ కుమార్ హిరాణి. ఈ ఇద్దరూ ప్రతీ సినిమాతోనూ సంచలనాలు సృష్టిస్తుంటారు. ఇప్పుడు హిరాణీ మరో మ్యాజిక్ చేసాడు. ఆ మ్యాజిక్ పేరు సంజూ. ఈ చిత్రం విడుదలై సంచలన విజయం సాధించే దిశగా అడుగేస్తుంది. ఇప్పటి వరకు రెండు రోజుల్లోనే ఇండియాలో 74 కోట్లు.. ఓవర్సీస్ తో కలిపి 85 కోట్లు వసూలు చేసింది. చూస్తుంటే మూడు రోజుల్లోనే 120 కోట్ల మార్క్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఫుల్ రన్ లో కూడా సంచలనాలు చేసేలా కనిపిస్తుంది సంజూ. ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే 230 కోట్లకు పైగా వసూలు చేయాలి. కానీ ఇప్పుడు ఆ మార్క్ దాటి 300 కోట్లకు కూడా వెళ్లేలా కనిపిస్తుంది ఈ చిత్రం. అన్నట్లు రణ్ బీర్ కపూర్ కు కూడా ఐదేళ్ల తర్వాత అసలైన విజయం వచ్చింది. ఈయన కెరీర్ చాలా ఏళ్లుగా డల్ పీరియడ్ లో ఉంది. అనుకున్నట్లుగానే సంజూ వచ్చి రణ్ బీర్ ను బతికించాడు. మొత్తానికి వరసగా ఐదో విజయాన్ని అందుకుని ఔరా అనిపించాడు రాజ్ కుమార్ హిరాణి.