English   

సంజూ ట్రైల‌ర్.. ర‌ణ్ బీర్ సంపేసాడంతే..!

Ranbir Kapoor
2018-05-30 18:45:25

సంజ‌య్ ద‌త్ జీవితం అంటేనే వివాదాల మ‌యం. స్టార్ ఇమేజ్ ఉన్నా.. తండ్రి అండ ఉన్నా.. చిన్న ఏజ్ లోనే పెడ‌దోవ ప‌ట్టి బ్యాడ్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు సంజ‌య్ ద‌త్. 35 ఏళ్ల‌కే దేశ‌ద్రోహం కేస్ నెత్తిన వేసుకున్నాడు. అక్ర‌మాయుధాల కేస్ లో ఏళ్ల‌కేళ్లు జైల్లో ఉన్నాడు. ఇక ఇండ‌స్ట్రీ ప‌రంగా కూడా సంజ‌య్ ద‌త్ పై చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అమ్మాయిల‌తో సంబంధాలు.. హీరోయిన్ల‌తో ఎఫైర్లు.. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను టైమ్ కు రాకుండా ఇబ్బంది పెట్ట‌డాలు.. ఇలా ఎన్నో సంజూ బాబా జీవితంలో జ‌రిగాయి. వీట‌న్నింటినీ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా సినిమాలో చూపిస్తున్నాడు రాజ్ కుమార్ హిరాణీ. తాజాగా విడుద‌లైన సంజూ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలు వంద రెట్లు పెంచేసింది. అస‌లు జైల్లో ఈయ‌న జీవితం ఎలా గ‌డిచిందో అనే విష‌యంపై ఇన్నాళ్లూ చిన్న అనుమానాలు ఆస‌క్తి ఉండేవి. ఇప్పుడు ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత దానిపై కూడా క్లారిటీ వ‌చ్చింది. జైల్లో సంజ‌య్ ద‌త్ కు న‌ర‌కం చూపించారు పోలీసులు. ఇవ‌న్నీ ట్రైల‌ర్ లోనే చూపించేసాడు ద‌ర్శ‌కుడు. ఇక ర‌ణ్ బీర్ క‌పూర్ అయితే సంజ‌య్ దత్ పాత్ర‌లోకి దూరిపోయి న‌టించాడు. అస‌లు ఈయ‌న న‌టించాడు అన‌డం అవ‌మాన‌మే.. జీవించాడంతే. ద‌ర్శ‌కున్ని పూర్తిగా న‌మ్మేసి సంజూ పాత్ర‌లో ఒదిగిపోయాడు. ఈ చిత్రం జూన్ 29న విడుద‌ల కానుంది. అప్ప‌టి వ‌ర‌కు ఈ ట్రైల‌ర్ చూసి ఖుషీ అయిపోవ‌చ్చు అభిమానులు. ఈ ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత సినిమాపై కూడా అంద‌రికీ అనుమానాలు తీరిపోయాయి. క‌చ్చితంగా ఈ చిత్రం సంచల‌నం సృష్టించ‌డం ఖాయ‌మ‌నే విష‌యం అర్థ‌మైపోతుంది. చూడాలిక‌.. రేపు విడుద‌లైన త‌ర్వాత సంజూ ఎన్ని కొత్త రికార్డుల‌కు తెర‌తీస్తాడో..?  

More Related Stories