English   

సప్తగిరిని గజదొంగ అంటున్నారు..!!

sapthagiri

కమెడియన్ గా చాలా తక్కువ టైమ్ లోనే స్టార్డమ్ తెచ్చుకున్నాడు సప్తగిరి. అంతే స్పీడ్ గా హీరో కూడా అయిపోయాడు. హీరోగా సప్తగిరి ఎక్స్ ప్రెస్ తో ఫర్వాలేదనిపించుకున్నాడు. కానీ తర్వాత వచ్చిన సప్తగిరి ఎల్ఎల్.బి మాత్రం నిరాశపరిచింది. దీంతో మళ్లీ కమెడియన్ గా కొన్ని సినిమాలు చేశాడు. దీంతో యూ టర్న్ తీసుకున్నాడు అనుకున్నారు చాలామంది. కానీ సప్తగిరి సడెన్ గా మరో సినిమా అనౌన్స్ చేశాడు. ఆ సినిమా పేరే గజదొంగ. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఇదే పేరుతో తీసిన సినిమా సూపర్ హిట్. ఇప్పుడా టైటిల్ ను మళ్లీ సప్తగిరి కూడా వాడుతున్నాడు. కాకపోతే ఆ గజదొంగకు దీనికి పోలిక మాత్రం ఉండదంటున్నారు. అయితే తొలి, మలి సినిమాలకు నిర్మాతగా ఉన్నాయన ఈ సారి మారాడు.

ఈ గజదొంగ కోసం కొత్త నిర్మాతలు వచ్చారన్నమాట. ఇక గత రెండు సినిమాల్లో తన స్ట్రెంత్ కంటే హీరోయిజానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన సప్తగిరి ఈ సారి కూడా అదే చేయబోతున్నాడు. అంటే కేవలం కమెడియన్ గా సినిమాను నడిపించడు.. పూర్తి స్థాయి కమర్షియల్ హీరోగా ఉంటాడన్నమాట. ఇక ఇండస్ట్రీలో చాలా సీనియర్ ప్రొడక్షన్ హౌసెస్ లో వర్క్ చేసిన డి రామకృష్ణ అనే అతను ఈ సినిమాతో దర్శకుడుగా మారుతున్నాడు. ఇ సినిమాను నంద నంద‌నా ప్రాజెక్ట్స్ ప‌తాకంపై శ‌ర్మ చుక్కా, యెడల నరేంద్ర, జివిఎన్ రెడ్డి నిర్మిస్తున్నారు. మరి ఈ గజదొంగ నిర్మాతలకు సొమ్ము దోచిపెడతాడా లేక దోచుకుంటాడా అనేది చూడాలి. 

More Related Stories