English   

సైఫ్ కూతురు కూడా వ‌చ్చేస్తుంది..

Sara-Ali-Khan

బాలీవుడ్ లో మ‌రో వార‌సురాలు ఎంట్రీకి రంగం సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే అక్క‌డ చాలా మంది హీరోయిన్లు ర‌ప్ఫాడిస్తున్నారు. ఇప్పుడు వీళ్ల‌కు తోడుగా సైఫ్ అలీ ఖాన్ కూతురు వ‌చ్చేస్తుంది. సారా అలీఖాన్ ఎంట్రీపై చాలా రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. అయితే ఏ సినిమాతో ఈమె ఎంట్రీ ఇస్తుందో అనేది కొన్నాళ్లుగా చర్చ న‌డుస్తుంది. ఈ త‌రుణంలో సైఫ్ కూతురు ఎంట్రీకి టెంప‌ర్ రీమేక్ సెట్ట‌యింది.

రోహిత్ శెట్టి ద‌ర్శ‌కుడిగా ర‌ణ్ వీర్ సింగ్ హీరోగా న‌టించ‌బోయే టెంప‌ర్ రీమేక్ లో సారా అలీఖాన్ హీరోయిన్ గా న‌టించ‌బోతుంది. దీనికి సింబా అనే టైటిల్ కూడా ఖ‌రారు చేసారు. టెంప‌ర్ క‌థ‌ను హిందీ ప్రేక్ష‌కుల‌కు త‌గ్గ‌ట్లుగా కాస్త మార్చ‌బోతున్నాడు రోహిత్ శెట్టి. పైగా ఈ ద‌ర్శ‌కుడికి కామెడీ టైమింగ్ ఎక్కువ‌. అందుకే టెంప‌ర్ క‌థ‌లోని ఫ‌స్టాఫ్ ను చాలా ఎంట‌ర్ టైనింగ్ గా మార్చ‌బోతున్నాడు రోహిత్. కీల‌క‌మైన సెకండాఫ్ ను మాత్రం అలాగే ఉంచ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. 

సింబాను క‌ర‌ణ్ జోహార్ నిర్మించ‌బోతున్నాడు. సింబాలో హీరోయిన్ గా ప్రియా వారియ‌ర్ న‌టిస్తుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ అన్ని అనుమానాలకు తెర‌దించుతూ క‌ర‌ణ్ జోహార్.. రోహిత్ శెట్టినే సారా అలీఖాన్ త‌మ హీరోయిన్ అంటూ ట్విట్ట‌ర్ లో అనౌన్స్ చేసారు. దాంతో సింబా భామ‌పై డౌట్స్ అన్నీ క్లియ‌ర్ అయిపోయాయి. మ‌రి చూడాలిక‌.. మిగిలిన క‌రీనా క‌పూర్, సోనాక్షి, సోన‌మ్ లాంటి వార‌సురాళ్ల మాదిరి సారా అలీఖాన్ కూడా బాలీవుడ్ లో ర‌ప్ఫాడిస్తుందో లేదంటే అథియాశెట్టి.. ఇషాడియోల్ లా డిజాస్ట‌ర్ అవుతుందో..?

More Related Stories