English   

కొర‌టాల ఆయ‌న్ని చంపేసాడుగా..!

Sarath-Kumar

అదేంటి.. కొర‌టాల ఎవ‌ర్ని చంపేసాడు.. అయినా అంత అవ‌స‌రం ఆయ‌న‌కు ఏం వ‌చ్చింది.. మ‌నిషిని చంపేంత ధైర్యం ఈ ద‌ర్శ‌కుడికి ఉందా.. ఏంటీ మ‌త‌ల‌బు అనుకుంటున్నారా..? అవును.. అంత ధైర్యం లేదు.. పైగా కొర‌టాల అలాంటి వ్య‌క్తి కూడా కాదు. కాక‌పోతే ఈయ‌న ఇప్పుడు భ‌ర‌త్ అనే నేనులో ఓ సీనియ‌ర్ న‌టుడి పాత్ర‌ను చంపేస్తున్నాడు. భ‌ర‌త్ అనే నేను పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతుంది. ఇప్ప‌టికే షూటింగ్ కూడా చివ‌రిద‌శ‌కి వ‌చ్చేసింది. మ‌హేశ్ ఇందులో ముఖ్య‌మంత్రిగా న‌టిస్తున్నాడు. ఈయ‌న తండ్రిగా త‌మిళ స్టార్ శ‌ర‌త్ కుమార్ న‌టిస్తున్నాడు. హీరోతో స‌మాన‌మైన పాత్ర ఇది. ప్ర‌తీ సినిమాలో హీరోతో స‌మాన‌మైన పాత్ర‌ను మ‌రోటి సృష్టించ‌డం కొర‌టాలకు అల‌వాటే. మిర్చిలో స‌త్య‌రాజ్.. శ్రీ‌మంతుడులో జ‌గ‌ప‌తి బాబు.. జ‌న‌తా గ్యారేజ్ లో మోహ‌న్ లాల్.. ఇలా ప్ర‌తీ సినిమాలో ఒక‌ర్ని తీసుకొచ్చాడు. 

త‌న మూడు సినిమాల్లో ఎందులోనూ ఒక్క పెద్ద కారెక్ట‌ర్ ను కూడా చంప‌లేదు కొర‌టాల‌. కానీ భ‌ర‌త్ అను నేనులో మాత్రం సెంటిమెంట్ మార్చేసాడు కొర‌టాల‌. ఇందులో శ‌ర‌త్ కుమార్ కారెక్ట‌ర్ చ‌చ్చిపోతుంది. అయినా ఇంకా సినిమా విడుద‌ల కాలేదు.. పైగా టీజ‌ర్ లో కూడా అలాంటిదేం క‌నిపించ లేదు క‌దా.. ఇప్పుడు ఎలా తెలిసింది అనుకుంటున్నారా..? ఈ సినిమా స్టిల్ ఒక‌టి విడుద‌లైంది. అందులో శ‌ర‌త్ కుమార్ చిత్ర ప‌ఠానికి దండేసి ఉంది. పైగా పూల‌తో అలంక‌రించారు. అంటే ఈ చిత్రంలో ఆయ‌న పాత్ర మ‌ర‌ణిస్తుంద‌నేగా అర్థం. మొత్తానికి ఇన్ని సినిమాల త‌ర్వాత ఫ‌స్ట్  టైమ్ హీరో తండ్రి పాత్ర‌ని చంపేస్తున్నాడు కొర‌టాల శివ‌. ఎప్రిల్ 20న ఈ సినిమా విడుద‌ల కానుంది. కైరాఅద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్. మొత్తానికి చూడాలి.. శ‌ర‌త్ కుమార్ పాత్ర‌ను కొర‌టాల ఎలా డిజైన్ చేసి ఉంటాడో..?

More Related Stories