English   

రికార్డుల వేట మొదలెట్టిన సర్కారు వారి పాట

Sarkaru Vaari Paata
2020-06-01 12:49:01

సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి ఫాంలో ఉన్నాడు. స్పైడర్ సినిమా తరువాత నుండి అపజయమే లేని హీరోగా ఆయన దూసుకు వెళ్తున్నారు. సంక్రాంతికి మేజర్ అజయ్ గా వచ్చిన ఆయన సరిలేరు నీకెవ్వరు అనిపించుని ‘సర్కారు వారి పాట’ అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. నిన్న కృష్ణ పుట్టిన రోజు కానుకగా ఈ మూవీ ప్రీ లుక్ రిలీజ్ చేస్తూ అధికారికంగా టైటిల్ ప్రకటించింది చిత్రయూనిట్. ఆసక్తికరంగా ఉన్న ఈ ప్రీ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారిన సంగతి తెలిసిందే. అయితే మహేష్ సర్కార్ వారి పాత రికార్డులు ఈ ప్రీ లుక్ తోనే మొదలయింది. ఎలా అంటే విడుదలైన తొలి 24 గంటల్లోనే ఎక్కువ రీ ట్వీట్స్ చేయబడిన, ఎక్కువ లైక్స్ సంపాదించి టైటిల్ ట్యాగ్ పరంగాను సత్తా చాటుతూ రికార్డుల ‘వేట సాగిచింది ఈ సర్కారు వారి పాట. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
 

More Related Stories