వకీల్ సాబ్ సత్యమేవ జయతే సాంగ్ వచ్చేసింది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలా గ్యాప్ తరవాత వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, బోణీకపూర్ మరియు శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ స్వరాలు సమకూర్చారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి మహిళల దినోత్సవం సందర్భంగా విడుదలైన మగువా..మగువా సాంగ్ శ్రోతలను అలరించింది. కాగా తాజాగా ఈ సినిమా నుండి మరో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సత్యమేవ జయతే అంటూ సాగే ఈ పాటకు తమన్ స్వరాలు సమకూర్చగా ప్రముఖ లిరిక్ రైటర్ రామజోగయ్య ఈ పాట రాసారు. అంతే కాకుండా ఈ పాటను ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ పాడారు. ఇక దేశ భక్తి నేపథ్యంలో వచ్చిన ఈ పాటలోని లిరిక్స్ పవన్ కల్యాణ్ కోసమే రాసినట్టు ఉన్నాయి. ఆయన ఇమేజ్ కి తగ్గట్టుగా ఉన్నాయి.