English   

కొడుకుని హీరోగా లాంచ్ చేయనున్న ఫ్యామిలీ సినిమాల డైరెక్టర్

Satish Vegesna
2020-07-03 11:06:22

టాలీవుడ్‌లో వారసుల ఎంట్రీ మామూలే. ఎంత మంది ఎంట్రీలు ఇచ్చినా వారసుల్లో కొద్ది మంది మాత్రమె పరిశ్రమలో నిలదొక్కుకుకోగలరు. అది కూడా టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, అదృష్టం కూడా మెండుగా కావాలి. ఇప్పుడు ఒక దర్శకుడి కొడుకు తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. అయితే దర్శకుడి కొడుకు దర్శకుడి అవుతాడనుకోకండి ఆయన హీరోగా పరిచయం కాబోతున్నాడని అంటున్నారు. శతమానంభవతి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు డైరెక్టర్ గా సతీష్ వేగేశ్న దగ్గరయ్యాడు. ఆ తర్వాత అయన చేసిన 'శ్రీనివాస కళ్యాణం', 'ఎంత మంచి వాడవురా' సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆడకపోయినా కుటుంబం అంతా కూర్చుని చూసే సినిమాలు చేస్తారనే పేరు మాత్రం తెచ్చిపెట్టింది. అయితే ఇప్పుడు ఆయన తన కుమారుడు సమీర్ వేగేశ్నని హీరోగా పరిచయం చేస్తున్నారని సమాచారం. ఆ సినిమాకి ఆయనే స్వయంగా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతుండడం విశేషం. గత ఏడాది స్వర్గీయ శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరిని లాంచ్ చేసిన ఎంఎల్వి సత్యనారాయణ ఈ సినిమాని కూడా నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం సతీష్ అల్లరి నరేష్ హీరోగా వస్తోన్న నాంది సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా పోస్టర్స్ తోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. చూడాలి మరి ఏమవుతుందనేది. 

More Related Stories