English   

సత్య దేవ్ తో తమన్నా రొమాన్స్

Satyadev Tamannaah
2020-07-15 08:54:46

తెలుగులో వేరే బాషల సినిమాలు రీమేక్ చేయడం కొత్త ఏమీ కాదు. ఇక టాలీవుడ్‌ లో అయితే ప్రస్తుతం రీమేక్ ట్రెండ్ నడుస్తోంది. రీమేక్ సినిమాలన్నీ దాదాపు హిట్ లు కొన్ని సూపర్ డూపర్ హిట్టవుతుండటంతో హిట్ లేని వారు అంతా అదే బాట పడుతున్నారు. ఇక తాజాగా హీరో సత్యదేవ్ ఓ క్రేజీ రీమేక్ ఆఫర్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన కన్నడ హిట్ మూవీ అయిన లవ్ మోక్టైల్ మూవీ తెలుగు రీమేక్ లో నటిస్తున్నారని అంటున్నారు. అదీ కాక హీరోయిన్ తమన్నా సత్యదేవ్ కి జంటగా నటించనుందని అంటున్నారు. 

రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాని కన్నడ దర్శకుడు నాగ శేఖర్ దర్శకత్వం వహించానున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమాకి సంగీతం కాల భైరవ అందించానున్నారని అంటున్నారు. ఇక ఇటీవల సత్యదేవ్ నటించిన 47 డేస్ అనే థ్రిల్లర్ ఓటిటిలో విడుదలైంది. ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య మూవీ రేపటి నుండి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. కేర్ ఆఫ్ కంచర పాలెం ఫేమ్ మహా వెంకటేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మలయాళ హిట్ చిత్రం మహేశింటే ప్రతీకారంకి తెలుగు రీమేక్ గా తెరకెక్కనుంది.

More Related Stories