English   

మరో సినిమా అనౌన్స్ చేసిన సత్యదేవ్

Satyadev
2020-09-09 13:08:20

తెలుగులో అండర్ రేటెడ్ యాక్టర్ ఎవరైనా ఉన్నారా ? అంటే చాలా మంది అసలు ఆలోచించకుండా చెప్పేసే పేరు సత్య దేవ్ కంచరాన. ఎప్పుడో సీతమ్మ వాకిట్లో సిరి మల్లెచెట్టు సినిమా నుండే సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్న ఈ నటుడు బ్లఫ్ మాస్టర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన ఈ మధ్య వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తూ డిజిటల్ లో తెలుగు కంటెంట్ ని పుష్ చేస్తూ వస్తున్నాడు. ఈయన హీరోగా తెరకెక్కుతున్న ఉమామహేశ్వరరావు ఉగ్రరూపస్య సినిమాని డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. కరోన కారణంగా థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ అయ్యే పరిస్థితి లేని కారణంగా ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేశారు.  ఇప్పటికే తమన్నా సరసన 'గుర్తుందా శీతాకాలం' అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న ఈయన మరో సినిమా అనౌన్స్ చేశారు. ఆ సినిమా పేరు 'తిమ్మరుసు'. నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో పోస్టర్ ని నిన్న రిలీజ్ చేశారు. 'ఎస్సైన్ మెంట్ వాలి' అనేది ఈ సినిమాకి ట్యాగ్ లైన్. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలవుతుందని అంటున్నారు. ఈ సినిమాని ఈస్ట్ కోస్ట్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ మీద మహేశ్ కోనేరు, సృజన యరబోలు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

More Related Stories