English   

 మ‌హాన‌టిలో సావిత్రి చ‌నిపోదా..?

mahanati-savitri
2018-05-08 08:51:38

మ‌హాన‌టి సినిమా అనౌన్స్ అయిన‌ప్ప‌టి నుంచి అంద‌ర్లోనూ ఒక‌టే ఆస‌క్తి.. సినిమా తీయ‌డం అంతా ఒకెత్తు దాన్ని ముగించ‌డం మ‌రో ఎత్తు అని అంతా అనుకుంటున్నారు. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. సావిత్రి జీవితం అంతా ఎలా ఉన్నా.. చివ‌రి రోజుల్లో మాత్రం చాలా దారుణంగా ఉంది. ల‌క్ష‌లు సంపాదించినా కూడా చివ‌రి రోజుల్లో ఉండ‌టానికి ఇల్లు.. తిన‌డానికి తిండి కూడా లేద‌నే వార్త‌లున్నాయి. ఇలాంటివ‌న్నీ సినిమాలో ఎలా చూపించి ఉంటాడా ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ అంటూ మ‌హాన‌టి కోసం ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు ప్రేక్ష‌కులు. అయితే ఇవ‌న్నీ ఇలా ఉండ‌గా ఇప్పుడు ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది. మ‌హాన‌టి క్లైమాక్స్ లో క‌చ్చితంగా అంతా సావిత్రి చ‌నిపోయిన స‌న్నివేశాలు కూడా చూపిస్తాడ‌ని చూస్తున్నారు. కానీ నాగ్ అశ్విన్ మాత్రం సావిత్రిని స‌జీవంగానే ఉంచాడ‌ని తెలుస్తుంది. ఆమె ప‌థనాన్ని ఎక్కువ‌గా చూపించ‌లేద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే కానీ నిజ‌మైతే మాత్రం నాగ్ అశ్విన్ అతిపెద్ద సాహ‌సం చేసిన‌ట్లే. ఎందుకంటే సావిత్రి జీవితం అంటేనే ఆమె చివ‌రిరోజ‌ల్లో ఏం జ‌రిగింది అని తెలుసుకోడానికి వ‌చ్చే ప్రేక్ష‌కులు ఉంటారు. వాళ్లు కానీ నిరాశ ప‌డితే సినిమా ప‌రిస్థితే తిర‌గ‌బ‌డే అవ‌కాశం లేక‌పోలేదు. మ‌రి ఈ రిస్క్ నాగ్ అశ్విన్ ఎలా అధిగ‌మించి ఉంటాడో చూడాలిక‌..!

More Related Stories